Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : వార్‌ 2 పాట కోసం కియారా హొయలు

హృతిక్‌ రోషన్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'వార్ 2' సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.

By:  Ramesh Palla   |   5 Aug 2025 4:35 PM IST
పిక్‌టాక్ : వార్‌ 2 పాట కోసం కియారా హొయలు
X

హృతిక్‌ రోషన్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'వార్ 2' సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్‌ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగిన విషయం తెల్సిందే. ముఖ్యంగా తెలుగు మార్కెట్‌లో వార్‌ 2 కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యధిక స్క్రీన్స్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేయడం కోసం సితార నాగవంశీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వార్‌ 2 సినిమాలో హీరోయిన్‌గా నటించిన కియారా అద్వానీ ప్రెగ్నెన్సీ కారణంగా ప్రమోషన్స్‌కి హాజరు కాలేక పోయింది. కానీ ఆమె సోషల్‌ మీడియా ద్వారా తనవంతుగా వార్‌ 2 కి ప్రమోషన్‌ చేస్తూనే ఉంది. వార్‌ 2 లోని ఆవన్‌ జావన్‌ పాట గురించి ప్రస్తుతం చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.


హృతిక్‌ రోషన్‌కి జోడీగా కియారా అద్వానీ

ఆవన్‌ జావన్‌ లో కియారా అద్వానీ, హృతిక్ రోషన్‌ కాంబో ఉంటుంది. ఇద్దరి డాన్స్‌కి ప్రేక్షకులు ఖచ్చితంగా ఫిదా అవుతారు అంటూ మేకర్స్‌ చెబుతున్నారు. అన్నట్లుగానే కియారా అందంతో పాటు, మేకింగ్‌ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. కియారా అద్వానీ ఆవన్‌ జావన్‌ లో ఎలా కనిపించింది క్లారిటీ ఇచ్చింది. ఆ పాట కోసం ధరించిన ఔట్‌ ఫిట్‌ ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది. పొట్టి డ్రెస్‌లో కియారా అద్వానీ భలే అందంగా ఆకట్టుకునే విధంగా ఉంది. చాలా స్మూత్‌ లుక్‌లో కియారా అద్వానీ ఆకట్టుకుంది. వార్ 2 సినిమాలో కియారా బికినీ ట్రీట్‌ ఉండబోతున్న విషయం తెల్సిందే. బికినీ ఫోటోల ముందు ఇవి పెద్దగా ప్రేక్షకులకు నచ్చుతాయా అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కానీ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.


వార్‌ 2 తో కియారా అద్వానీ స్టార్‌డం రెట్టింపు

కియారా అద్వానీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి కష్టపడుతూ వచ్చింది. ఓవర్‌ నైట్‌లో కియారా స్టార్‌డం దక్కించుకోలేదు. సినిమా సినిమాకు క్రేజ్‌ పెరిగింది. ఆమె స్టార్‌డం పెంచుకుంటూ పోయింది. ఇప్పుడు కియారా అద్వానీ యొక్క స్టార్‌డం ముందు చాలా మంది హీరోయిన్స్ సైతం నిలబడలేని పరిస్థితి. ఆమె వార్‌ 2 తర్వాత మరింతగా టాప్‌ రేంజ్‌కి వెళ్తుందనే ఉద్దేశంతో కావాలని కొందరు ఆమెపై నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇండస్ట్రీలో కియారా అద్వానీ ఇలా అందంగా, నటనతో మెప్పించడం వల్ల ఎన్ని ట్రోల్స్ వచ్చినా, నెగటివ్‌ ప్రచారం జరిగినా కూడా తట్టుకుని నిలదొక్కుకుంటుంది. అంతే కాకుండా చాలా నమ్మకంగా ఆమె ఇండస్ట్రీలో ముందుకు సాగుతుంది.


అయాన్ ముఖర్జీ దర్శకత్వంపై నమ్మకం

వార్ 2 సినిమా విషయానికి వస్తే మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్ మొదటి సారి హిందీ సినిమాను చేయడంతో పాటు, హృతిక్ రోషన్‌ వంటి సూపర్‌ స్టార్‌తో స్క్రీన్‌ ను షేర్‌ చేసుకోవడం వల్ల అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అయాన్‌ ముఖర్జీ ఈ సినిమాను రూపొందించాడని ట్రైలర్‌ ను చూస్తే అర్థం అవుతుంది. టీజర్‌కి నెగటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ, ట్రైలర్‌ వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయింది. సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌ షురూ అయ్యాయి. అయితే రజనీకాంత్‌ కూలీ సినిమా వల్ల ఈ సినిమాకు చాలా పెద్ద డ్యామేజీ ఉండే అవకాశం ఉందని బాక్సాఫీస్‌ వర్గాల వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓపెనింగ్‌ విషయంలో కూలీ ని వార్‌ 2 బీట్‌ చేస్తుందనే నమ్మకంను హృతిక్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.