Begin typing your search above and press return to search.

వార్ 2 లో AI వాడకం.. లిప్ సింక్ తో న్యూ స్ట్రాటజీ!

బాలీవుడ్‌ బిగ్ ప్రాజెక్ట్ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మొదటిసారి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

By:  M Prashanth   |   12 Aug 2025 2:56 PM IST
వార్ 2 లో AI వాడకం.. లిప్ సింక్ తో న్యూ స్ట్రాటజీ!
X

బాలీవుడ్‌ బిగ్ ప్రాజెక్ట్ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మొదటిసారి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పాన్‌ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ప్రమోషన్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మేకర్స్‌ ప్రత్యేకంగా AI ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను వాడినట్లు తెలుస్తోంది.

తెలుగులో లిప్ సింక్ సహజంగా కనపడేలా AI టెక్నాలజీని ఉపయోగించారట. దీని వల్ల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ‘డబ్‌డ్’ గా కాకుండా ‘స్ట్రైట్ తెలుగు’ సినిమాలా అనిపించేలా చూస్తారన్న ప్రచారం జరుగుతోంది. CBFC సర్టిఫికేట్ ప్రకారం, “వార్ 2” తెలుగు వెర్షన్‌ కూడా డబ్‌డ్ వెర్షన్‌గానే నమోదైంది. అంటే ఇది ముంబైలో షూట్‌ చేసిన హిందీ సినిమా, కానీ తెలుగు డైలాగులు తర్వాత రికార్డ్‌ చేసి, వాటిని AI సాయంతో పాత్రల పెదవుల కదలికలకు ఖచ్చితంగా సరిపోల్చారు.

ఈ లిప్ సింక్ క్వాలిటీ వల్ల సాధారణంగా డబ్‌డ్ మూవీస్‌లో వచ్చే లిప్ మిస్‌మ్యాచ్ సమస్య తగ్గిపోయింది. ఫలితంగా స్క్రీన్‌పై హృతిక్ లేదా ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు ప్రేక్షకులకు ఇది పూర్తిగా తెలుగు సినిమా అన్న భావన కలిగే అవకాశం ఉంది. ఇలాంటి AI లిప్ సింక్ టెక్నాలజీని భారతీయ సినిమాల్లో ఈ స్థాయిలో ఉపయోగించడం అరుదు. ఇప్పటివరకు హాలీవుడ్‌లో కొన్ని ప్రయోగాలు జరిగినా, మన సినిమాల్లో ఇది మొదటి పెద్ద స్కేల్ ప్రయత్నాల్లో ఒకటిగా చెప్పవచ్చు.

టెక్నికల్ వైపు నుంచి చూస్తే ఇది నిజంగా ఇండస్ట్రీలో యూ టర్న్. వాయిస్ డబ్బింగ్ మరియు హావభావాలు సింక్ అవ్వడం వల్ల ఆసక్తి పెరిగి, ప్రేక్షకుడి అనుభవం మెరుగుపడుతుంది. కానీ మరోవైపు, ఇది భవిష్యత్తులో ఒక పెద్ద చర్చకు దారితీసే అవకాశమూ ఉంది. సినిమా మేకర్స్‌ ఈ టెక్నాలజీని సినిమా స్ట్రైట్ తెలుగు వెర్షన్ అన్నట్టుగా ప్రమోట్ చేయడం కొంతమందికి అభ్యంతరంగా ఉంది.

ఎందుకంటే ఇది వాస్తవానికి హిందీ చిత్రమే. కేవలం లిప్ సింక్‌ కోసం AI ఉపయోగించడం వలన భాష మార్చిన ఫీల్ తగ్గిపోవచ్చు కానీ, అది మూలభాషా నిర్మాణాన్ని మార్చదు. రేపు ఇదే లాజిక్‌తో ఒక తెలుగు సినిమా స్పానిష్ లేదా చైనీస్‌లో AI లిప్ సింక్‌తో విడుదల చేస్తే, ఆ భాష ప్రేక్షకులు దాన్ని స్ట్రైట్ సినిమాగా భావించవచ్చు. ఇది ‘ఒరిజినల్’ అనే నిర్వచనాన్ని మారుస్తుందేమో అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

ఇక వ్యాపారపరంగా చూసుకుంటే, ఈ టెక్నాలజీ పాన్‌ ఇండియా రిలీజ్‌లకు మంచి బూస్ట్ ఇస్తుంది. లాంగ్వేజ్ బారియర్‌ తగ్గిపోవడంతో, నటుల ఎక్స్ప్రెషన్స్, పెదవుల కదలికలు స్థానిక భాషకు సరిగ్గా సరిపోవడంతో డబ్‌డ్ ఫీల్ తగ్గిపోతుంది. ఇది కలెక్షన్లపై పాజిటివ్ ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది. కానీ దీని వల్ల ఒరిజినల్ లాంగ్వేజ్ మూవీ క్రెడిట్ తగ్గిపోతుందేమో అన్న ఆందోళన వర్గాల నుంచి వస్తోంది. ప్రత్యేకంగా లాంగ్వేజ్ వైవిధ్యం, ప్రాంతీయత విలువలను కాపాడాలనుకునే సినీ ప్రేమికులు దీనిపై మిక్స్‌డ్ రియాక్షన్ చూపిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఈ తరహా ఆలోచనల ఎలాంటి మార్పులకు దారి తీస్తుందో చూడాలి.