Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ట్రెడిషనల్ ఔట్‌ ఫిట్‌ లో వామికా అందం...!

తాజాగా మరోసారి ఒక ప్రముఖ మేగజైన్ కోసం ట్రెడిషనల్ లుక్‌ లో ఇలా అందంగా కనిపించి వైరల్‌ అయ్యింది

By:  Tupaki Desk   |   7 Dec 2023 5:00 AM GMT
పిక్ టాక్ : ట్రెడిషనల్ ఔట్‌ ఫిట్‌ లో వామికా అందం...!
X

పంజాబీ, హిందీ, మలయాళం, తెలుగు, తమిళం ఇలా అనేక భాషల్లో నటించి మెప్పించిన వామికా గబ్బి సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు సెన్షేషనల్ స్టార్ గానే తన అందాల ఫోటో షూట్‌ తో నిలుస్తూ ఉంది. తాజాగా మరోసారి ఒక ప్రముఖ మేగజైన్ కోసం ట్రెడిషనల్ లుక్‌ లో ఇలా అందంగా కనిపించి వైరల్‌ అయ్యింది.


మత్తు ఎక్కించే కళ్లతో వామికా గబ్బి నెటిజన్స్ ను కవ్విస్తోంది. అంతే కాకుండా తన అందం తో చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఆకట్టుకునే ఔట్ ఫిట్ తో పాటు అందుకు మ్యాచ్ అయ్యే హెవీ జ్యువెలరీ ని కూడా వామికా ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ లుక్ లో కూడా వామికా భలే ఉందే అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.


తు మేరా 22 మెయిన్ తేరా 22 చిత్రంతో గుర్తింపు దక్కించుకుని నటిగా బిజీ అయిన వామికా ఉత్తరాదిన హిందీలో మాత్రమే కాకుండా పంజాబీ భాషల్లో చాలా సినిమాలు చేసింది. అదే సమయంలో సౌత్‌ నుంచి వచ్చిన ఆఫర్లను అంది పుచ్చుకుని వరుసగా ఇక్కడ కూడా సినిమాలు చేసింది.

తెలుగు లో ఈ అమ్మడు భలే మంచి రోజు సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా కమర్షియల్ గా విజయాన్ని సొంతం చేసుకోలేక పోవడంతో ఈ అమ్మడికి మళ్లీ టాలీవుడ్‌ నుంచి ఆఫర్‌ రాలేదు. అయితే ఇతర భాషల్లో మాత్రం ఈమె కొనసాగుతోంది. అందాలను చూస్తూ ఉంటే మళ్లీ టాలీవుడ్‌ లో ఈమెను చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు.