పిక్‌టాక్ : బ్లాక్ ఔట్ ఫిట్‌లో వామిక అరాచకం
తెలుగు ప్రేక్షకులకు భలే మంచి రోజు సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ వామికా గబ్బి.
By: Tupaki Desk | 15 Jun 2025 12:00 PM ISTతెలుగు ప్రేక్షకులకు భలే మంచి రోజు సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ వామికా గబ్బి. ఈ అమ్మడు తెలుగులో ఆ తర్వాత పెద్దగా నటించలేదు. కానీ మలయాళం, పంజాబీ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. సుదీర్ఘ కాలం తర్వాత తెలుగులో గూఢచారి సినిమా సీక్వెల్ జీ2 లో నటిస్తుంది. తెలుగులో మొదటి సినిమా తో నిరాశ పరిచిన ముద్దుగుమ్మ వామికా గబ్బి ప్రస్తుతం చేస్తున్న సినిమాతో హిట్ కొడుతాను అనే నమ్మకంతో ఉంది. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం వామిక జీ2 మాత్రమే కాకుండా తమిళ్‌లో రెండు, పంజాబీలో ఒకటి, హిందీలో రెండు, మలయాళంలో ఒక సినిమాను చేస్తుంది. ఒకేసారి అర డజను సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. వామిక చేతిలో ప్రస్తుతం అర డజను సినిమాలు ఉన్నాయి.
వామిక గబ్బి గత ఏడాది కేవలం ఒకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ దావన్ హీరోగా రూపొందిన బేబీ జాన్ సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు వామికా గబ్బి కూడా హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా నిరాశ పరచినా కూడా వామిక కి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు. గత ఏడాదిలో ఈమె చేసిన సినిమాలు పెద్దగా విడుదల కాకపోవడంతో ఈసారి ఆ లోటును భర్తి చేసే విధంగా బ్యక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతుంది. ఈ ఏడాది ఆరంభంలోనే వామిక గబ్బి నుంచి భూల్ చుక్ మాఫ్ అనే హిందీ సినిమా వచ్చింది. త్వరలో మరో సినిమాతో ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాలతో చాలా బిజీగా ఉన్న వామికా సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వామికా గబ్బి బ్లాక్ ఔట్ ఫిట్ ఫోటో షూట్ పిక్స్‌ను షేర్ చేసింది. సాధారణంగానే వామికా గబ్బి ప్రతి ఫోటో షూట్‌లో అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అంతకు మించి అన్నట్లుగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. బ్లాక్ డ్రెస్‌లో ముద్దుగుమ్మలు చాలా అందంగా ఉంటారని వామికా మరోసారి నిరూపించింది. ఆమె స్కిన్ టోన్‌కి బ్లాక్ డ్రెస్ అద్భుతంగా సెట్ అయిందని, ఈ డిజైనర్ బ్లాక్ డ్రెస్‌లో వామికా మెరిసి పోతుందని నెటిజన్స్ సైతం తెగ కామెంట్ చేస్తూ ఫోటోలను షేర్ చేస్తున్నారు. నెట్టింట ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వామికా ఫోటోలు అరాచకం అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.
1993లో చండీగఢ్‌లోని పంజాబీ ఫ్యామిలీలో జన్మించిన ఈ అమ్మడు అక్కడే సెయింట్ జేవియర్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. అక్కడే డీఏవీ కాలేజ్‌లో ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. మోడలింగ్ పై ఆసక్తితో మొదటి నుంచి ఈమె ఆ దిశగా అడుగులు వేసింది. చదువు పూర్తి అయిన తర్వాత ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తమిళ చిత్రం మాలై నెరత్తు మయక్కం సినిమాతో నటించడం ద్వారా పరిచయం అయింది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడికి అన్ని భాషల్లోనూ నటించే అవకాశాలు దక్కాయి. ఈ అమ్మడి లక్ తో పెద్దగా హిట్స్ లేకున్నా కూడ ఆ వరుస సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి. ముందు ముందు టాలీవుడ్‌లో ఈ అమ్మడు మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
