నటిని చుట్టుముట్టిన సీతాకోక చిలుకలు
ఈ నల్లటి గౌనును సీతాకోకచిలుకలతో డిజైన్ చేయడం సర్వత్రా ఆసక్తిని కలిగించింది. సీతా కోక హెడ్‌బ్యాండ్‌ను చేతితో ఎంబ్రాయిడరీ చేశారు.
By: Tupaki Desk | 15 April 2025 6:40 PM ISTనటి వామికా గబ్బి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో రైజింగ్ స్టార్‌గా ఈ బ్యూటీ హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'భూల్ చుక్ మాఫ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు సరసన వామిక నటించింది. మూవీ రిలీజ్ ముందు ముంబైలో జరిగిన హై-ఫ్యాషన్ గాలాలో వామిక ర్యాంప్ పై మెరిసింది. కళ్లు చెదిరే అందాన్ని డ్రమటైజ్‌గా ప్రెజెంట్ చేయడంలో తనకు సాటి లేరెవరూ అని వామిక నిరూపించింది. ఈ భామ ఆల్ బ్లాక్ ఎంబెస్‌మెంట్‌ను ఎంపిక చేసుకుంది.
ప్రఖ్యాత 'ది వర్డ్' మ్యాగజైన్ కాస్ట్యూమ్ గాలాలో వామికా గబ్బి రెడ్ కార్పెట్‌పై గుబులు రేపే ప్రదర్శనతో ఆకట్టుకుంది. వైరల్‌గా చుట్టుముట్టిన సీతా కోక చిలుకలు తన ఒంటిపై వాలాయి! ఈ డ్రెస్ చూడగానే నెటిజనుల ఫీలింగ్ ఇది. ప్రత్యేకతతో కూడిన అందమైన డిజైనర్ బ్లాక్ గౌనును వామిక ధరించి కనిపించింది. స్ట్రాప్‌లెస్ కైలానీ బ్లాక్ గౌను ప్లంగింగ్ నెక్‌లైన్ తో ఎంతో ఆకట్టుకుంది. మెలోన్ క్రేప్ క్రిస్టల్ ఫాబ్రిక్‌తో తయారు చేసిన ఈ డ్రెస్ రిఫ్లెక్టివ్ షిమ్మర్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ఈ నల్లటి గౌనును సీతాకోకచిలుకలతో డిజైన్ చేయడం సర్వత్రా ఆసక్తిని కలిగించింది. సీతా కోక హెడ్‌బ్యాండ్‌ను చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. ఇది సెమిప్రెషియస్ రాళ్ళు, గాజు పూసలు, ఇత్తడి పదార్థంతో పొదిగినది. వామికా నల్లటి స్టడెడ్ చెవిపోగులు, స్టేట్‌మెంట్ రింగ్, మ్యాట్ బ్లాక్ మానిక్యూర్‌ను ఎంచుకుంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.