Begin typing your search above and press return to search.

కల్కి..చివరకు మంచి శకున'మే'

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   7 April 2024 5:30 AM GMT
కల్కి..చివరకు మంచి శకునమే
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో బజ్ నెలకొంది. అప్డేట్స్, లీక్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ మూవీ రిలీజ్ మళ్లీ పోస్ట్ పోన్ అయింది! మే నెలలో ఎన్నికలు ఉండడంతో సినిమాను మేకర్స్ వాయిదా వేయక తప్పలేదు.

కల్కిని రూపొందిస్తున్న వైజయంతీ మూవీస్ బ్యానర్ కు మే 9 సెంటి మెంట్ డేట్. ఇప్పటికే ఆ బ్యానర్ నుంచి అదే తేదీకి వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో కల్కిని కూడా అప్పుడే రిలీజ్ చేద్దామనుకున్నా కుదరలేదు. దీంతో మే30వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం. త్వరలో ఈ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

అయితే ఈ కొత్త రిలీజ్ డేట్ విషయంలో డిస్ట్రిబ్యూటర్లు, ట్రేడ్ నిపుణులు సహా పలువురితో చర్చలు జరిపిన తర్వాత మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మే30వ తేదీ సెలవు లేనప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేదు. మే 29వ తేదీన అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో కల్కి ప్రీమియర్స్ కూడా వేయనున్నట్లు సమాచారం. ఆ తేదీకి ఫ్యూరియస్: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా తప్ప మిగతా సినిమాల రిలీజ్ లేం లేవు.

కాబట్టి ఓవర్సీస్ లో కల్కి సినిమాకు పెద్ద ఎత్తున స్క్రీన్లు దొరకుతాయి. ఇక భారత్ లో అప్పటికే ఎన్నికల హడావుడి పూర్తవుతుంది. కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఐపీఎల్ కూడా మే 26 తో కంప్లీట్ అయిపోతుంది. విద్యార్థులకు కొన్ని సెలవులు కూడా ఉంటాయి. దీంతో కల్కి సినిమా రిలీజ్ కు మే 30వ తేదీ సరైన డేట్ అని అంతా అభిప్రాయపడుతున్నారు. సాలిడ్ ఓపెనింగ్స్ రావడం పక్కా అని చెబుతున్నారు.

కాస్త లేట్ అయినా మంచి డేట్ కే సినిమాను రిలీజ్ చేస్తున్నారని అంటున్నారు. అయితే మేకర్స్ వీలైనంత త్వరగా సినిమాను ప్రమోట్ చేయాలని సూచిస్తున్నారు. నార్త్ ఇండియాలో భారీగా ప్రమోషన్స్ చేపట్టి అందరి దృష్టిని తమ వైపు తిప్పుకోవాలని అంటున్నారు. ఇప్పటికే హాలీవుడ్ రేంజ్ లో కల్కి ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్లీలూడ్ వీడియోస్ ను ఓటీటీలో ఏప్రిల్ 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.

కల్కి 2898 ఏడీ మూవీ.. భారతీయ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ.600 కోట్లకుపైగా బడ్జెట్ తో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమా.. ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి మరి.