Begin typing your search above and press return to search.

వైరల్‌ వీడియో : 90 ఏళ్ల వయసులో లెజెండ్రీ నటి

వైజయంతి మాల ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాకుండా ఈ వయసులోనూ ఆమె భరతనాట్యం స్టెప్స్ ను చేసి ఆశ్చర్యపర్చారు.

By:  Tupaki Desk   |   30 Aug 2023 4:53 AM GMT
వైరల్‌ వీడియో : 90 ఏళ్ల వయసులో లెజెండ్రీ నటి
X

బాలీవుడ్‌ లెజెండరీ స్టార్ నటి వైజయంతి మాల 90 ఏళ్ల వయసులో అడుగు పెట్టారు. అర్థ శతాబ్దం పాటు తన సినిమాలతో అలరించి.. అప్పటికి ఇప్పటికి ఆమెను అభిమానించే విధంగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన ఆమె తన 90వ పుట్టిన రోజు సందర్భంగా చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ మధ్య కాలంలో ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. ఆ వార్తలు నిజం కావని తేలిపోయింది. వైజయంతి మాల ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాకుండా ఈ వయసులోనూ ఆమె భరతనాట్యం స్టెప్స్ ను చేసి ఆశ్చర్యపర్చారు. నెటిజన్స్ షాక్ అయ్యి మరీ చూసే విధంగా వీడియో ఉంది.

గుంగా జుమ్నా సినిమా లో ఆమె నటనను గురించి అభిమానులు చర్చించుకుంటూ ఉన్నారు. అప్పటికి ఇప్పటికి ఆమె వయసు లో మార్పు వచ్చింది కానీ ఆమెలో నటన మరియు డాన్స్ పై ఆసక్తి తగ్గినట్లుగా అనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వయసు లో కూడా ఇంతగా యాక్టివ్‌ గా ఉండటం నిజంగా గ్రేట్‌. సాధారణంగా ఈ వయసుకు రాగానే చాలా మంది ఇక ఏమీ చేయలేము అన్నట్లుగా ఉండి పోతారు. కానీ తనకు ఉన్న డాన్స్ పై ఆసక్తిని ఆమె ఇలా చూపించారు. బాలీవుడ్ తో పాటు సౌత్‌ లో ముఖ్యంగా తెలుగు సినిమా ల్లో కూడా వైజయంతి మాల నటించిన విషయం తెల్సిందే.