Begin typing your search above and press return to search.

సిద్ధూ అత‌నికి ఛాన్స్ ఇస్తాడా?

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్ట‌ర్ గా ఓ వెలుగు వెలిగిన వి.వి వినాయ‌క్ గ‌త కొన్నేళ్లుగా సైలెంట్ గా ఉన్నాడు.

By:  Tupaki Desk   |   1 Jun 2025 2:30 PM
సిద్ధూ అత‌నికి ఛాన్స్ ఇస్తాడా?
X

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్ట‌ర్ గా ఓ వెలుగు వెలిగిన వి.వి వినాయ‌క్ గ‌త కొన్నేళ్లుగా సైలెంట్ గా ఉన్నాడు. వినాయ‌క్ హిట్ కొట్టి చాలా ఏళ్లే అయింది. అందుకే వినాయ‌క్ కు ఛాన్స్ ఇవ్వాలంటే ఎవ‌రైనా స‌రే భ‌య‌ప‌డుతున్నారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ తో వినాయ‌క్ చేసిన ఇంటెలిజెంట్ సినిమా డిజాస్ట‌ర్ అవ‌డంతో త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు.

గ్యాప్ త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛ‌త్ర‌ప‌తి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టాడు వినాయ‌క్. కానీ వినాయక్ కు ఛ‌త్ర‌ప‌తి రీమేక్ కూడా నిరాశ‌నే మిగిల్చింది. ఆ సినిమా అటు బెల్లంకొండ శ్రీనివాస్‌కు, ఇటు వినాయ‌క్ కెరీర్లో దారుణ‌మైన డిజాస్ట‌ర్ గా నిలిచింది. దీంతో చేసేదేమీ లేక తిరిగి టాలీవుడ్ కు వ‌చ్చేశాడు.

అయితే ఇప్పుడు వి. వి వినాయక్ టాలీవుడ్ లోని ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోతో సినిమా చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. అత‌ను మ‌రెవ‌రో కాదు టిల్లూ ఫ్రాంచైజ్ హీరో సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌. వినాయ‌క్ సిద్ధూతో ఓ యూత్‌ఫుల్ ఎంట‌ర్టైనర్ ను త‌న త‌ర్వాతి సినిమాగా ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఆ సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ కు సిద్ధూ అయితే స‌రిగా స‌రిపోతాడ‌ని భావిస్తున్నాడట‌.

అందులో భాగంగానే సిద్దూని వినాయ‌క్ సంప్ర‌దించాడ‌ని అంటున్నారు. అయితే వినాయ‌క్ కు గ‌తంలో ఎంత భారీ ఇమేజ్, క్రేజ్ ఉన్నా ఇప్పుడు మాత్రం ఆయ‌న ఫామ్ లో లేడు. పైగా ఆయ‌న నుంచి సినిమా వ‌చ్చి చాలా కాల‌మైంది. అస‌లే రీసెంట్ గా జాక్ సినిమాతో ఫ్లాపును అందుకున్న సిద్ధూ, ట్రాక్ లో లేని వినాయ‌క్ తో సినిమాకు ఒప్పుకుంటాడా అనేది ప్ర‌శ్న‌గా మారింది. మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది. ఏదేమైనా వినాయ‌క్ హిట్ కొడితే చూడాల‌ని అత‌ని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.