Begin typing your search above and press return to search.

ప్రభాస్ - మారుతి.. నిర్మాత షాక్ ఇచ్చాడుగా!

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ప్రెస్ మీట్ లో ఆయన ప్రభాస్ ప్రాజెక్టు గురించి కొన్ని ప్రశ్నలు ఎదుర్కొన్నాడు.

By:  Tupaki Desk   |   9 Nov 2023 11:55 AM GMT
ప్రభాస్ - మారుతి.. నిర్మాత షాక్ ఇచ్చాడుగా!
X

ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో సైలెంట్ గా సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. పీపుల్స్ వీడియో ఫ్యాక్టరీలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనే విషయంలో ఇప్పటివరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. సినిమా దర్శకుడు మారుతి అలాగే అందులో నటిస్తున్న నటీనటులు వర్క్ చేస్తున్న టెక్నీషియన్స్ బయట ఎక్కడ కనిపించినా కూడా అసలు ప్రాజెక్టు గురించి ఏ మాత్రం నోరు విప్పడం లేదు.

తప్పకుండా ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని మారుతీ ఆ మధ్య ఒక పాజిటివ్ రియాక్షన్ ఇచ్చాడు కానీ అసలు సినిమా పై వస్తున్న గాసిప్స్ గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక నిర్మాత వివేక్ అయినా ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని ఎదురుచూసిన అభిమానులకు కొంత నిరాశ ఎదురైంది.

పీపుల్స్ వీడియో ఫ్యాక్టరీలో వివేక్ సప్తసాగరాలు దాటి సైడ్ బి సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ప్రెస్ మీట్ లో ఆయన ప్రభాస్ ప్రాజెక్టు గురించి కొన్ని ప్రశ్నలు ఎదుర్కొన్నాడు. సినిమా ఎక్కడి వరకు వచ్చింది? అసలు ఎందుకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు? అనే ప్రశ్నలకు ఆయన ఒక విధంగా షాక్ అయ్యేలా ఆన్సర్ ఇచ్చారు అని చెప్పాలి.

ప్రస్తుతానికైతే సినిమాకు సంబంధించిన అప్డేట్ గురించి ఏమి ప్లాన్ చేయలేదు. సమయం వచ్చినప్పుడు మాత్రమే దానికి సంబంధించిన అప్డేట్ తప్పకుండా ఇస్తామని తెలియజేశారు . ఇక ప్రస్తుతం తామ ఫోకస్ ఈగల్ సినిమాపై ఎక్కువగా ఉంది అని ఆ సినిమాను సంక్రాంతికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాము అని అన్నారు.

ప్రభాస్ నుంచి నెక్స్ట్ సలార్ రానున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత కల్కి ముందు వస్తుందా లేక మారుతి సినిమా ఉంటుందా అనేది కాలమే సమాధానం ఇవ్వాలి. ఇక వచ్చే ఏడాది సమ్మర్ తరువాత గాని మారుతి ప్రాజెక్టు పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ సందీప్ రెడ్డి తో స్పిరిట్ సినిమా చేయనున్నాడు. అలాగే హను రాఘవపూడి తో కూడా ఒక సినిమా లైన్ లోకి రానుంది.