Begin typing your search above and press return to search.

షారూఖ్ ఫ్యాన్స్‌లా కాదు ప్ర‌భాస్ ఫ్యాన్స్ సంస్కారం!

ఇటీవలి ఇంటర్వ్యూలో వివేక్ అగ్నిహోత్రి డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్.. షారూఖ్ ఫ్యాన్స్ పై తీవ్రంగా ఆరోపించారు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 4:55 AM GMT
షారూఖ్ ఫ్యాన్స్‌లా కాదు ప్ర‌భాస్ ఫ్యాన్స్ సంస్కారం!
X

వివేక్ అగ్నిహోత్రి తెర‌కెక్కించిన 'ది వ్యాక్సిన్ వార్' విడుదలకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 28న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం నిజానికి ప్రభాస్ 'స‌లార్‌'తో బాక్సాఫీస్ వద్ద ఢీకొనాల్సి ఉంది. అయితే స‌లార్ అనూహ్యంగా ఈ ఏడాది డిసెంబర్‌కు వాయిదా ప‌డింది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ 'డుంకీ'తో ప్ర‌భాస్ పోటీ ఖాయ‌మైంది. ఇటీవలి ఇంటర్వ్యూలో వివేక్ అగ్నిహోత్రి డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్.. షారూఖ్ ఫ్యాన్స్ పై తీవ్రంగా ఆరోపించారు.

ఆయ‌న మాట్లాడుతూ త‌నను ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో కించ‌ప‌రుస్తూ కామెంట్లు చేసార‌ని ఆరోపించారు. ది వ్యాక్సిన్ వార్‌తో పాటు సలార్ థియేటర్‌లలోకి రావాల్సిన క్ర‌మంలో ప్రభాస్ అభిమానులు త‌న‌ను తీవ్రంగా ట్రోల్ చేశారని పేర్కొన్నారు. ది వ్యాక్సిన్ వార్ స్టార్స్ లేని చిన్న సినిమా.. 12.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాం. స‌లార్‌ అనే 300 కోట్ల బ‌డ్జెట్ సినిమా పోటీకి వ‌స్తోంది. ఆ సంద‌ర్భంలో ప్ర‌భాస్ అభిమానులు నన్ను దుర్భాషలాడారు. ట్రోల్ చేసారు. ఇస్కో భగావో, నహీ ఆనా చాయే... భాగ్ కోయి ఔర్ గయా.. వారు పారిపోయారు...అని అగ్నిహోత్రి వ్యాఖ్యానించారు.

జవాన్ స‌క్సెస్ తో షారుఖ్ ఖాన్ అభిమానులు కూడా తనను దుర్భాషలాడుతున్నారని అగ్నిహోత్రి తెలిపారు. ప్ర‌త్యేకించి ఎవరి పేరును రివీల్ చేయ‌క‌పోయినా కానీ.. 'భారీ బాలీవుడ్' చిత్రం అభిమానులు తన కుమార్తె ఫోటోలను ఉపయోగించి తనను ట్రోల్ చేస్తున్నారని ఆవేదన చెందారు. ''దీన్ని చూడకండి.. అస్స‌లు చూడకండి''అని స్టార్ హీరో ఫ్యాన్స్ సూచిస్తున్నార‌ని అగ్నిహోత్రి ప్ర‌ముఖ‌ న్యూస్ పోర్టల్ కి వెల్ల‌డించారు. అయితే అత‌డి వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి ప్ర‌భాస్ ఫ్యాన్స్ అగ్నిహోత్రిని మాత్ర‌మే తిట్టారు. కానీ షారూఖ్ ఫ్యాన్స్ అత‌డి కుమార్తెను కూడా ట్రోల్ చేస్తున్నారు.


'ది వ్యాక్సిన్ వార్' బాక్సాఫీస్ వద్ద స‌లార్‌తో ఘర్షణ పడనప్పటికీ అదే రోజు థియేటర్లలోకి వచ్చే ఫుక్రే 3 నుండి పోటీని ఎదుర్కోవాల్సి ఉంది. దీని గురించి వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ-'ఇటీవ‌ల‌ విడుదలైన ఒక పెద్ద చిత్రం ఐదారు వారాల వయస్సులో ఉంది.

కానీ వారు ఇప్పటికీ మరే ఇతర చిత్రం బ‌రిలో లేనట్లు దాని గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ ట్రేడ్ జర్నలిస్టులంతా నాతో ఫుక్రే అనే సినిమా వస్తోందని రాశారు. నిజానికి దానితో నా సినిమాకు పోటీ లేదు. ఫుక్రే కామెడీ ఫ్రాంచైజీ. రెండూ భిన్నమైన సినిమాలు. రెండూ బాగా ఆడాలి. ఫుక్రే కూడా సూపర్‌హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ది వ్యాక్సిన్ వార్ కూడా చూడాలి.. అని అన్నారు.

వ్యాక్సిన్ వార్ వ్యాక్సిన్‌ల అభివృద్ధి వెనుక భారతీయ శాస్త్రవేత్తల గొప్ప ప్ర‌య‌త్నాల‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తుంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి ప్రధాన పాత్రలు పోషించారు. పల్లవి జోషికి చెందిన 'ఐ యామ్ బుద్ధా' సంస్థ‌ నిర్మిస్తున్న ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 28న విడుదల కానుంది.