Begin typing your search above and press return to search.

రణబీర్ 'రామాయణం'.. రంగంలోకి మరో అగ్ర నటుడు!

బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ ఈ చిత్రంలో చేరనున్నాడట. విద్యుత్జిహ్వ అనే డెమన్ ప్రిన్స్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   7 Jun 2025 7:17 AM
రణబీర్ రామాయణం.. రంగంలోకి మరో అగ్ర నటుడు!
X

నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణం’ సినిమా భారతీయ సినిమా పరిశ్రమలో భారీ హైప్‌ను సృష్టిస్తోంది. నమిత్ మల్హోత్రా, హీరో యష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది, మొదటి భాగం దీపావళి 2026లో, రెండవ భాగం 2027లో వచ్చే అవకాశం ఉంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా భారీ VFX, భారతీయ సంస్కృతి ఆధారంగా రూపొందుతోంది.

ఇక సన్నీ డియోల్ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా కనిపించనున్న ఈ సినిమా ఇప్పటికే క్యాస్టింగ్ తో అభిమానులను ఆకర్షించింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ముంబైలో భారీ సెట్‌లో జరుగుతోంది, హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ గై నారిస్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నాడు. ఈ సినిమా రూ. 850 కోట్ల బడ్జెట్‌తో భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

రణబీర్ కపూర్ లార్డ్ రాముడిగా ఇంటెన్స్ లుక్‌తో, యష్ రావణుడిగా భారీ లుక్‌లో కనిపించనున్నాడు. ఇక సినిమా భారతీయ పురాణాన్ని గ్లోబల్ స్థాయిలో చూపించేలా రూపొందుతోందని టీమ్ ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం, ‘రామాయణం’ సినిమా ఇప్పుడు మరింత పెద్దదిగా మారింది, బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ ఈ చిత్రంలో చేరనున్నాడట. విద్యుత్జిహ్వ అనే డెమన్ ప్రిన్స్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. ఈ పాత్ర సూర్పనఖ భర్తగా కనిపించనుంది.

రకుల్ ప్రీత్ సింగ్ సూర్పనఖల పాత్రలో నటిస్తోంది. విద్యుత్జిహ్వ రావణుడితో (యష్) పలు సన్నివేశాల్లో కనిపించే అవకాశం ఉందని, ఈ పాత్ర సినిమాకు కొత్త ఆకర్షణను జోడిస్తుందని అభిమానులు అంటున్నారు. ఇక వివేక్ ఓబరాయ్ ‘కంపెనీ’, ‘ఓమ్కారా’, ‘క్రిష్ 3’లాంటి సినిమాలతో తన నటనతో మెప్పించాడు. ఈ సినిమాలో ఆయన డెమన్ ప్రిన్స్‌గా నటించడం ఈ చిత్రాన్ని మరింత ఆసక్తికరంగా మార్చనుంది.

రకుల్ ప్రీత్ సింగ్ రూపంలో సూర్పనఖల పాత్ర గురించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి, ఈ జంట కథలో కీలకమైన భాగంగా నిలవచ్చని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ 2025 చివరి నాటికి ఫినిష్ కానుందట. ఇక, ఈ కొత్త జోడీ ఎలా పనిచేస్తుందో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘రామాయణం’ సినిమా భారీ VFX, హాలీవుడ్ టెక్నాలజీతో రూపొందుతోంది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.