వజ్రాల వ్యాపారంలోకి ప్రముఖ నటుడు!
ఒబెరాయ్ ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో వందల కోట్ల విలువ చేసే వ్యాపారాలు చేస్తున్నాడు. అతడు దాదాపు 1200కోట్ల నికర ఆస్తులతో రిచెస్ట్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు.
By: Tupaki Desk | 17 April 2025 9:52 AM ISTవివేక్ ఒబెరాయ్ పరిచయం అవసరం లేదు. అతడు 'రక్త చరిత్ర' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల్లోను అభిమానులను సంపాదించుకున్నాడు. పలు తమిళ చిత్రాల్లోను ఒబెరాయ్ నటించాడు. ప్రస్తుతం 'మస్తీ 4' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ సంవత్సరం విడుదల కానుంది. అయితే సినిమాలు మాత్రమే కాదు.. వ్యాపారంలోను అతడు నిష్ణాతుడు. వ్యాపారం ఎప్పుడూ ప్లాన్ బి. సినిమాలు నా అభిరుచి అని చెబుతుంటాడు.
ఒబెరాయ్ ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో వందల కోట్ల విలువ చేసే వ్యాపారాలు చేస్తున్నాడు. అతడు దాదాపు 1200కోట్ల నికర ఆస్తులతో రిచెస్ట్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విద్య నుంచి, రకరకాల వ్యాపారాల్ని మేనేజ్ చేయడంలో ఉద్ధండుడిగా నిరూపించాడు. అతడు ఇప్పుడు వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. ల్యాబ్ లో తయారు చేసి విక్రయించే వజ్రాల వ్యాపారం ఇది! అని వివేక్ స్నేహితుడు రికీ వసంతా తాజాగా జాతీయ మీడియాకు వెల్లడించాడు. వ్యాపార నిర్వహణలో ఒబెరాయ్ సామర్థ్యాన్ని కీర్తించిన అతడు అతడితో కలిసి ఈ వ్యాపారంలో కొనసాగుతానని ప్రకటించాడు. ఒబెరాయ్ ముందు చూపు ఉన్న వ్యాపారవేత్త. నడిచే, మాట్లాడే బిజినెస్‌మేన్! అని కీర్తించాడు.
వివేక్ ఒబెరాయ్ ఇటీవల పలు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతున్నాడు. 'సోలియాట్రియో'లో రికీ, వివేక్ వ్యాపార భాగస్వాములుగాను ఉన్నారు. వివేక్ నటించిన సినిమాలు చూసి అతడి నటనను ఇష్టపడ్డానని, ఆ తర్వాత అతడిని కలిసి ఈ కొత్త వ్యాపారం గురించి ఆలోచించానని రికీ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. వ్యాపారంలో ఒబెరాయ్ నెక్ట్స్ లెవల్ నటుడు అంటూ కీర్తించాడు. దేనిలో అయినా ప్రవేశించే ముందే ఒబెరాయ్ అన్ని వివరాలతో సిద్ధంగా ఉంటాడని, ఇందులో డబ్బు పోగొట్టుకోవడం తమకు ఇష్టం లేదని కూడా రికీ అన్నారు.
