రజనీని డైరెక్ట్ చేయబోతున్న నాని డైరెక్టర్!
ప్రస్తుతం లోకేష్ కనగరాజ్‌తో భారీ పాన్ ఇండియా మూవీ `కూలీ` చేస్తున్న రజనీ ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 17 May 2025 12:37 PM ISTమన సీనియర్ స్టార్లు ట్రాక్ మార్చారు. సీనియర్ డైరెక్టర్లని పక్కన పెట్టి యంగ్ డైరెక్టర్లుకు ఛాన్స్‌లిస్తూ తాము ఇంకా యంగేనని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తుండగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇదే తరహాలో యంగ్ టాలెంట్‌కు అవకాశాలిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్‌తో భారీ పాన్ ఇండియా మూవీ `కూలీ` చేస్తున్న రజనీ ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారీ తారగణంతో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. దీని తరువాత ఆ వెంటనే మరో సినిమాని పట్టాలెక్కిస్తున్నారు. అదే `జైలర్ 2`. 2023లో విడుదలై సంచలనం సృష్టించిన `జైలర్` మూవీకిది సీక్వెల్. దీన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ చిత్రాల నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఎస్.జె. సూర్య విలన్‌గా నటిస్తున్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌తో పాటు టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ కీలక పాత్రలో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్నారు.
ఇప్పటికే ఈ మూవీ కోసం బాలయ్య 20 రోజులు డేట్స్ కూడా ఇచ్చేశారట. ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత రజనీకాంత్ మరో యంగ్ డైరెక్టర్‌లో సినిమాకు రెడీ అవుతున్నారు. ఆ యంగ్ డైరెక్టర్ మరెవరో కాదు టాలీవుడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఇటీవల నేచురల్ స్టార్ నానితో `సరిపోదా శనివారం` పేరుతో భారీ బ్లాక్ బస్టర్‌ని తెరకెక్కించి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఇటీవలే సూపర్ స్టార్ రజనీకి వివేక్ ఆత్రేయ కథ వినిపించారట.
అది రజనీకి ఎంతగానో నచ్చిందని, వెంటనే ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడని కోలీవుడ్ టాక్. ఈ భారీ మూవీని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. రీసెంట్‌గా తమిళ హీరో అజిత్‌తో `గుడ్ బ్యాడ్ అగ్లీ` మూవీని నిర్మించిన మైత్రీ ఈ సారి సూపర్ స్టార్ రజనీ సినిమాని టార్గెట్‌గా పెట్టుకోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది.
