వివాదాస్పద దర్శకుడు ఫైల్స్ కాన్సెప్ట్ వదలడా?
వివేక్ అగ్ని హోత్రి పరిచయం అసవరం లేని పేరు. వివాదాస్పద దర్శకుడిగానూ పేరుంది. హేట్ స్టోరీ, జిద్, బుదాన్ ఇన్ ట్రాఫిక్ జామ్, జున్నో నియాత్ లాంటి సినిమాలతో వెలుగులోకి వచ్చాడు.
By: Tupaki Desk | 11 Jun 2025 4:00 PM ISTవివేక్ అగ్ని హోత్రి పరిచయం అసవరం లేని పేరు. వివాదాస్పద దర్శకుడిగానూ పేరుంది. హేట్ స్టోరీ, జిద్, బుదాన్ ఇన్ ట్రాఫిక్ జామ్, జున్నో నియాత్ లాంటి సినిమాలతో వెలుగులోకి వచ్చాడు. అటుపై 'ది తాష్కెంట్ ఫైల్స్', 'కశ్మీర్ ఫైల్స్', 'ది కశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్', 'ది వ్యాక్సిన్ వార్' సినిమాలతో మరింత ఫేమస్ అయ్యాడు. ఫైల్స్ ప్రాంచైజీలోకి ఎంటర్ అయిన తర్వాత దర్శకుడిగా వివేక్ పేరు బాగా ప్రాచు ర్యంలోకి వచ్చింది.
అదే సమయంలో వివాదాస్పద దర్శకుడిగానూ అంతే వైరల్ అయ్యాడు. దీంతో కొంత కాలంగా వివేక్ ఫైల్స్ కాన్సెప్ట్ ని విడిచిపెట్టకుండా పనిచేస్తున్నాడు. దాన్నే సక్సస్ ఫార్ములుగా మార్చుకుని హిట్లు ముందుకె ళ్తున్నాడు. ప్రస్తుతం 'ఢిల్లీ ఫైల్స్', 'బెంగాల్ ఫైల్స్' అంటూ మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. తాజాగా 'ది బెంగాల్ ఫైల్స్ ని రైట్ లైఫ్' గా పేర్చు మార్చాడు. 1940 బెంగాల్ లో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న చిత్రమిది.
ఆయన తీసుకున్న కాన్సెప్ట్ లు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. కమర్శియల్ గానూ మంచి ఫలితాలు అందుకుంటున్నారు. బడ్జెట్ కూడా ఓవర్ ది బోర్డ్ దాటడం లేదు. తక్కువ బడ్జెట్ లోనే మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అయితే వివేక్ వరుసగా ఇదే తరహా ఫైల్స్ ని ఆధారంగా చేసుకుని సినిమాలు చేయడంపై విమర్శ కూడా వ్యక్తమవుతుంది. ఆయన నుంచి ప్రేక్షకులు మరింత కొత్త కాన్సెప్ట్ లు ఆశిస్తున్నారని ఓ నెటి జనుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
వివేక్ ఫైల్స్ చూసి చూసి బోరు కొడుతుందని..జానర్ మార్చి కొత్త కాన్సెస్ట్ లు తీస్తే బాగుంటుందని కోరాడు. మరి దీనికి వివేక్ అగ్ని హోత్రి ఎలాంటి బధులిస్తాడో చూడాలి. సాధరణంగా వివేక్ సోషల్ మీడియా కామెంట్లకు రెస్పాండ్ అవుతుంటాడు. సందర్భాన్ని బట్టి అతడి సమాధానం కూడా అంతే కఠువుగానూ ఉంటుంది. మరి నెటి జనుడు కోరుకున్న మార్పును ఎలా తీసుకుంటాడో చూడాలి.