బాలీవుడ్ ఇండస్ట్రీకి ఆ హీరో డాన్ లాంటోడా!
మరి అందులో అంత రూడ్ పాత్రలో కనిపించిన రణబీర్ కపూర్ ని ఎందుకు విమర్శించలేదు. అతడిపై బాలీవుడ్ మీడియాలో ఒక్క విమర్శ కూడా రాలేదు.
By: Tupaki Desk | 15 May 2025 12:56 PMబాలీవుడ్ ఇండస్ట్రీకి డాన్ తరహా హీరో ఒకడున్నాడా? అతడు కన్నెర్న జేసాడంటే పరిశ్రమ ఒణికిపోతుందా? అతడిని ముందు నిలబడి మాట్లాడాలంటేనే డైరెక్టర్లు ఒణికిపోతారా? అతడి ఇంటికి ఎవరెళ్లినా చేతులు కట్టుకుని నుంచోవల్సిందేనా? అంటే అవుననే అంటున్నాడు డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి. 'యానిమల్' సినిమా విషయలో ఆ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను మాత్రమే విమర్శించారు.
మరి అందులో అంత రూడ్ పాత్రలో కనిపించిన రణబీర్ కపూర్ ని ఎందుకు విమర్శించలేదు. అతడిపై బాలీవుడ్ మీడియాలో ఒక్క విమర్శ కూడా రాలేదు. ఇండస్ట్రీలో అయితే అసలు చర్చకే రాలేదు. ఎందు కంటే రణబీర్ని విమర్శించే ధైర్యం ఇండస్ట్రీలో ఎవరికీ లేదు. ఇండస్ట్రీలో అతడు చాలా పవర్ పుల్ . ఓ డాన్ లా పరిశ్రమను ఏలుతున్నాడు. అతడిని విమర్శించడం పక్కనబెట్టండి దైర్యంగా ముందుకొచ్చి కూడా మాట్లాడలేరు.
అంత ధైర్యం ఉంటే ఎవరినైనా అలా ఓ సారి ప్రయత్నించి చూడమనండి. చాలా మంది దర్శకులు హీరోల గురించి వారి వెనుక మాట్లాడుతారు. బహిరంగంగా ముందుకొచ్చి చెప్పే ధైర్యం ఎవరూ చేయరు. రణబీర్ విషయంలో అయితే అస్సలు రిస్క్ తీసుకోరు. ఎవరైనా ఆయన చెప్పింది చేయాల్సిందే. అలా డాన్ తరహా పాత్రలు పోషించే వారికే నిర్మాతలు కూడా వందల కోట్లు పారితోషికం ఇస్తుంటారు.
వారు భయపడి ఇస్తారా? సినిమా కోసం ఇస్తారా? అన్నది ఒక్కోసారి అర్దం కాదన్నారు. నిజమైన స్టార్ కు భారీ మొత్తంలో చెల్లించినా అర్దముంటుంది. ఏ ఇమేజ్ లేకుండా కూడా కోట్లు దండుకుంటున్నారు. ఇదెంత వరకూ న్యాయమని వికేవ్ అభిప్రాయపడ్డారు. మరి ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందిస్తారా? అన్నది చూడాలి.