Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో ర‌చ్చ చేసి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడా?

బాలీవుడ్ లో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడిగా వివేక్ అగ్ని హోత్రికి పేరున్న సంగ‌తి తెలిసిందే. ముక్కు సూటి మ‌నిషి. మ‌న‌సులో భావోద్వేగాన్ని అంతే ఓపెన్గా చెప్ప‌గ‌ల‌డు.

By:  Tupaki Desk   |   13 Jun 2025 4:00 PM IST
బాలీవుడ్ లో ర‌చ్చ చేసి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడా?
X

బాలీవుడ్ లో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడిగా వివేక్ అగ్ని హోత్రికి పేరున్న సంగ‌తి తెలిసిందే. ముక్కు సూటి మ‌నిషి. మ‌న‌సులో భావోద్వేగాన్ని అంతే ఓపెన్గా చెప్ప‌గ‌ల‌డు. ఇండస్ట్రీలో త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై ఓపెన్ అయిన సంద‌ర్భాలెన్నో. డైరెక్ట‌ర్ గా త‌న ఎదుగుద‌లు కింద‌కు తొక్కాల‌నే కొంద‌రి ప్ర‌య‌త్నాల‌ను ఆయ‌న ఎలా ఎండ‌గ‌ట్టారో తెలిసిందే. డైరెక్ట‌ర్ గా ఆయ‌న ఫేమ‌స్ అయిన త‌ర్వాత చెప్పిన సంగ‌తులివి.

హేట్ స్టోరీ, జిద్, బుదాన్ ఇన్ ట్రాఫిక్ జామ్, జున్నో నియాత్ లాంటి సినిమాలతో వెలుగులోకి వ‌చ్చాడు వివేక్. అటుపై 'ది తాష్కెంట్ ఫైల్స్', 'క‌శ్మీర్ ఫైల్స్', 'ది కశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్', ' ది వ్యాక్సిన్ వార్' సినిమాలతో మ‌రింత ఫేమ‌స్ అయ్యాడు. ఫైల్స్ ప్రాంచైజీలోకి ఎంట‌ర్ అయిన త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా వివేక్ పేరు బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. అనంత‌రమే బాలీవుడ్ తీరుపై ఓపెన్ అయి ప‌రిశ్ర‌మ‌కు యాంటీగా మారాడు.

అయితే వివేక్ అగ్ని హోత్రి వెళ్తూ వెళ్తూ బాలీవుడ్ లో పెద్ద ప్ర‌కంప‌న‌లు సృష్టించే అవకాశం ఉంటుంద‌ని కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థ‌ల్లో ఓ వార్త ప్ర‌చార‌మ‌వుతుంది. క‌శ్మీర్ పైల్స్... తాష్కెంట్ పైల్స్ అంటూ వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఆయ‌న తీసిన సినిమాల త‌ర‌హాలోనే బాలీవుడ్ కు రిటైర్మెంట్ ఇచ్చి వెళ్లే క్ర‌మంలో ప‌రిశ్ర‌మ‌లో చీక‌టి కోణంపైనా ఓ సినిమా తీసే అవ‌కాశం ఉంద‌ని వార్త లొస్తున్నాయి.

ఇండ‌స్ట్రీలో త‌న‌కెదురైన అనుభ‌వాలు..కాస్టింగ్ కౌచ్ అంశం..లైంగిక దాడలు...న‌టీన‌టుల అసంతృప్తి కాన్సెప్ట్ ఆధారంగా ఓ సినిమా తీసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు మీడియాలో వార్త‌లొస్తున్నాయి. అయితే ఆ ప‌ని ఇప్పుడే చేయ‌క‌పోయినా? ఆయ‌న ఇండ‌స్ట్రీని వ‌దిలి వెళ్లే ముందు ప‌రిశ్ర‌మ చీక‌టి కోణానికి దృశ్య‌రూపం ఇస్తాడ‌నే మాట బ‌లంగా వినిపిస్తుంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తేలాలి.