Begin typing your search above and press return to search.

వ‌రుణ్ సందేశ్ వైఫ్ 6-ప్యాక్ రెబ‌ల్ యాటిట్యూడ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో క‌నిపించిన అనంత‌రం వితిక సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది

By:  Tupaki Desk   |   1 Dec 2023 11:42 AM GMT
వ‌రుణ్ సందేశ్ వైఫ్ 6-ప్యాక్ రెబ‌ల్ యాటిట్యూడ్
X

వితిక షేరు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగులో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన తెలుగ‌మ్మాయి.. యువ‌హీరో వ‌రుణ్ సందేశ్ తో ప్రేమాయ‌ణం పెళ్లి వ‌గైరా విష‌యాలు తెలిసిన‌వే. వితిక షేరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కనిపించిన త‌ర్వాత చెప్పుకోద‌గ్గ‌ ఫాలోయింగ్ ని సంపాదించింది. అప్ప‌టి నుంచి మాజీ బిగ్ బాస్ ఫేం వితిక షేరు సందేశాత్మక వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తోంది. వీటికి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న‌లు వ‌స్తున్నాయి.


బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో క‌నిపించిన అనంత‌రం వితిక సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలంతో వితిక స్నేహం బిగ్ బాస్ హౌస్‌లో చర్చనీయాంశమైంది.. లాక్‌డౌన్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వితిక తన స్వంత ఛానెల్‌ని ప్రారంభించింది. తన దినచర్యలు, ఇన్ఫర్మేటివ్ వీడియోలను సోషల్ మీడియా ఖాతాల లో షేర్ చేస్తోంది. వితిక భర్త హీరో వరుణ్ సందేశ్ ఈ వీడియోలలో అక్కడక్కడ కనిపిస్తున్నారు.


తాజాగా వితిక షేర్ మ‌రో ఆస‌క్తిక‌ర ఫోటోషూట్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది. ''మీరు అసౌకర్యంగా ఉండటం, మీ పరివర్తనకు సంకేతం'' అంటూ ల‌వ్ ఈమోజీని షేర్ చేసింది. తాజా ఫోటోషూట్ లో వితిక నెట్టెడ్ (మెస్సీ) దుస్తుల్లో ఎంతో క్రేజీగా క‌నిపించింది. ఆస‌క్తిక‌రంగా త‌న టోన్డ్ యాబ్స్ ని కూడా వితిక ప్ర‌ద‌ర్శించింది. కార్గో జీన్స్, బ్లాక్ ఇన్న‌ర్ .. కాంబినేష‌న్ గా మెస్సీ గౌన్ ని వితిక ధ‌రించింది. వితిక స్ట్రైకింగ్ ఫోజ్ క్ష‌ణాల్లో అంత‌ర్జాలంలో వైర‌ల్ అయిపోయింది. దీనికి అభిమానులు కొంద‌రు స్పందిస్తూ ఉఫ్ అని వ్యాఖ్యానించారు. ''ఎందుకు అక్కా ఎప్పుడూ నాకు నచ్చలేదు .. నేను మారానా? మీరు మారారా....? అని ప్ర‌శ్నించాడు. వితిక మీలో ఫైర్ యాంగిల్ కూడా ఉంది..అని ఒక అభిమాని ఫైర్ ఈమోజీని షేర్ చేసారు. ''స‌లార్ లో ప్రభాస్ తో మీరు యాక్ట్ చేయాల్సిందే. ఆప్ట్ గా ఉంటారు! అంటూ ఒక అభిమాని ప్రేమ‌ను కురిపించాడు. ఒక అభిమాని వ‌రుణ్ తేజ్ వైఫ్ 6-ప్యాక్ చూసారా? అంటూ చిలిపిగా వ్యాఖ్యానించారు.

సోలార్ సైకిల్ ట్రాక్‌పై స్పెష‌ల్ వీడియో:

ఇటీవ‌లే హైదరాబాద్ శివార్లలో సైకిల్ కాంటెస్ట్ గురించి త‌న యూట్యూబ్ చానెల్ లో వివ‌రించిన‌ వితిక HGCL - హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ భారతదేశపు మొట్టమొదటి పొడవైన సైక్లింగ్ ట్రాక్‌ను హైదరాబాద్‌లో అభివృద్ధి చేసింద‌ని తెలిపింది. వితిక షేరు ఇటీవల ఈ సైక్లింగ్ ట్రాక్‌ని సందర్శించి ట్రాక్.. దాని వెనుక ఉన్న వివరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా వ్యూవ‌ర్స్ కోసం అందించారు. 23 కిమీ ట్రాక్ ఇద‌ని తెలిపారు. సైక్లింగ్ ట్రాక్‌పై సైకిల్ నడుపుతూ వితిక కనిపించింది. కొన్ని నెలల క్రితమే ప్రారంభ‌మైన ట్రాక్‌ సోలార్ ప్యానెళ్లతో కప్పబడి ఉందని, ఉత్పత్తి అయిన విద్యుత్ ఔటర్ రింగ్ రోడ్డులోని లైట్లకు, ట్రాక్ చుట్టూ ఉన్న మొక్కలకు నీరు పెట్టడానికి డ్రిప్ సదుపాయానికి సరఫరా చేస్తార‌ని వితిక వివరించింది. ఈ ట్రాక్ లో భద్రతా చర్యలు, సైకిల్ అద్దె తదితరాలు, హైదరాబాద్‌లోని సైక్లింగ్ ట్రాక్‌కు సంబంధించిన విలువైన సమాచారాన్ని షేర్ చేయ‌డంతో నెటిజన్లు ఈ వీడియోపై సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలను షేర్ చేయాలని కూడా కొందరు అడిగారు.