Begin typing your search above and press return to search.

థియేటర్లలో హిట్.. ఇప్పుడేంటీ డిబేట్?

థియేటర్లలో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ.. ఓటీటీలోకి వచ్చాక మాత్రం డిబేట్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

By:  M Prashanth   |   16 Sept 2026 11:06 AM IST
థియేటర్లలో హిట్.. ఇప్పుడేంటీ డిబేట్?
X

థియేటర్లలో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ.. ఓటీటీలోకి వచ్చాక మాత్రం డిబేట్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. థియేటర్లలో సినిమా చూసి మెచ్చుకున్న ప్రేక్షకుల్లో కొందరు.. ఇప్పుడు ఓటీటీలో చూసిన తర్వాత కథలోని కొన్ని విషయాలపై క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...

వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, యంగ్ బ్యూటీ మమితా బైజు లీడ్ రోల్స్ లో తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఆగస్టు 14వ తేదీ థియేటర్లలో విడుదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీకొడుకుల రిలేషన్, సరోగసీ, అరుదైన వ్యాధి వంటి ఎలిమెంట్స్ కలిపి కథను నడిపించారు మేకర్స్. థియేటర్లలో సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు కమర్షియల్‌ గా కూడా సక్సెస్ సాధించింది.

అయితే సెప్టెంబర్ 11వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ మొదలైన తర్వాత పరిస్థితి కొంత మారింది. ఓటీటీలో సినిమాను చూసిన కొందరు ప్రేక్షకులు.. ముఖ్యంగా లేడీస్.. స్టోరీ చూపించిన కొన్ని రిలేషన్స్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సినిమా ఫ్యామిలీ స్టోరీగా చెప్పుకుంటూనే మరోవైపు డబుల్ మ్యారేజ్, ఇల్లీగల్ రిలేషన్ ను తలపించే పరిస్థితులు, భారీ ఏజ్ గ్యాప్ తో లవ్ వంటి ఎలిమెంట్స్ ను చూపించడంపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి సినిమాలో 40 ఏళ్లు దాటిన సంజయ్ విశ్వనాథ్ తన ఫ్యామిలీని కొనసాగాలనే ఉద్దేశంతో సరోగసీ ద్వారా ఒక బిడ్డను పొందుతాడు. ఆ బిడ్డకు అరుదైన వ్యాధి రావడంతో అతనికి జన్మనిచ్చిన మ్యాడీ అవసరం అవుతుంది. ఆమెను ఇండియాకు తీసుకొచ్చిన తర్వాత కథలో ఊహించని ఎమోషనల్ ట్విస్టులు వస్తాయి. అప్పుడే మ్యాడీకి సంజయ్‌ పై ప్రేమ పుట్టడం కథలో మెయిన్ ఎలిమెంట్ గా మారుతుంది.

అదే విషయం ఇప్పుడు డిబేట్ కు కారణమవుతోంది. ఇలాంటి స్టోరీ ఎలిమెంట్స్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎలా చూపించారనే ప్రశ్న కొందరి నుంచి వస్తోంది. మరికొందరు మాత్రం ఇది పూర్తిగా సినిమా స్టోరీగా మాత్రమే చూడాలని, ఎమోషన్స్ యాంగిల్ లో అర్థం చేసుకోవాలని అంటున్నారు. అదే సమయంలో బెత్లెహెం కుటుంబ యూనిట్ వంటి సినిమాలతో కూడా ఇంకొందరు ఆడియన్స్ కంపేర్ చేస్తున్నారు.

ఒకే లాంటి కుటుంబ సమస్య మరో విధంగా చూపించిన ఆ సినిమాతో విశ్వనాథ్ అండ్ సన్స్ ను పోల్చుతూ నెట్టింట డిస్కస్ చేస్తున్నారు. అయితే విశ్వనాథ్ అండ్ సన్స్ లో సరోగసీ, బోన్ మ్యారో అవసరం వంటి ఎక్స్ ట్రా స్టోరీ ఎలిమెంట్స్ ఉండటంతో రెండు సినిమాల కథలు పూర్తిగా ఒకేలా ఉండవని చెప్పొచ్చు. ఏదేమైనా ఇప్పుడు థియేటర్‌ లో ప్రేక్షకులను మెప్పించిన కథే.. ఓటీటీలో మాత్రం రకరకాల అభిప్రాయాలకు కారణమైంది.