Begin typing your search above and press return to search.

మెగా విశ్వంభర.. ఇది పెద్ద ప్లానే..

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమా విశ్వంభర ను యువ దర్శకుడు వశిష్టతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 6:32 AM GMT
మెగా విశ్వంభర.. ఇది పెద్ద ప్లానే..
X

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమా విశ్వంభర ను యువ దర్శకుడు వశిష్టతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. మెగాస్టార్ కు సంబంధించిన సీన్స్ ఇంకా మొదలు కాలేదు కానీ దర్శకుడు మాత్రం హీరో అవసరంలేని సన్నివేశాలను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

చూస్తుంటే సినిమాను గ్రాండ్ విజువల్స్ తో తెరపైకి తీసుకురాబోతున్నట్లు అనిపిస్తుంది. జగదేకవీరుడు - అంజి లాంటి సినిమాలు తర్వాత మళ్లీ మెగాస్టార్ అలాంటి బ్యాట్ డ్రాప్ లో చేస్తున్న ఈ ఫాంటసీ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ కూడా 200 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. యూవి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇక విశ్వంభర సినిమాలో గ్రాఫిక్స్ ఆర్ట్ వర్క్ చాలా కీలకం కానుంది. అందుకే నిర్మాతలు ఆ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా సినిమా కోసం భారీగా ఖర్చు చేయబోతున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఎస్ ప్రకాష్ నేతృత్వంలో సినిమా కోసం ప్రత్యేకంగా 30 రకాల సెట్స్ వేయబోతున్నట్లు సమాచారం. ప్రతి సెట్ వరకు కూడా సినిమాలకు చాలా కీలకం కాదు అందుకే దీనికోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ కూడా నిర్వహించారు.

రకరకాల రీసెర్చ్ లు చేసిన తర్వాతనే ఆర్ట్ డైరెక్టర్ ఎస్ ప్రకాష్ పనులను మొదలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ గా ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకువెళ్లే విధంగా ఆ వర్కు తెరపై కనిపించేలా ఉండాలి అని దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు. దర్శకుడు వశిష్ట ఇదివరకే బింబిసార సినిమాతో తన టాలెంటెడ్ ను నిరూపించుకున్నాడు. దీంతో మెగాస్టార్ చిరంజీవి కంప్లీట్ గా అతన్ని నమ్మి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఆ మధ్య త్రిష పేరు కూడా గట్టిగానే వినిపించింది. అలాగే అనుష్క పేరు కూడా చర్చల్లోకి వచ్చింది. అయితే వీరి పేర్లు మాత్రం ఇంకా ఆఫీసుల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ సినిమాలో మాత్రం ఇద్దరూ ప్రధాన హీరోయిన్లు అలాగే ఒక చిన్న పాత్ర కోసం ప్రముఖ హీరోయిన్ ను కూడా సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక విశ్వంభర సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.