Begin typing your search above and press return to search.

విశ్వంభర.. చిరు క్యారెక్టర్ రిస్క్?

మెగాస్టార్ చిరంజీవికి కూడా విభిన్నమైన పాత్రలు చేయాలి అని చాలానే ఇష్టం ఉంటుంది. కానీ ఆడియన్స్ అంచనాలకు మాత్రం అలాంటి పాత్రలు క్లిక్ కాలేకపోతున్నాయి

By:  Tupaki Desk   |   16 Nov 2023 7:30 AM GMT
విశ్వంభర.. చిరు క్యారెక్టర్ రిస్క్?
X

మెగాస్టార్ చిరంజీవికి కూడా విభిన్నమైన పాత్రలు చేయాలి అని చాలానే ఇష్టం ఉంటుంది. కానీ ఆడియన్స్ అంచనాలకు మాత్రం అలాంటి పాత్రలు క్లిక్ కాలేకపోతున్నాయి. ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా కొన్నిసార్లు విభిన్నమైన పాత్రలు చేసే చాలా దారుణమైన ఫలితాన్ని ఎదుర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో నటుడిగా మంచి గుర్తింపును అందించిన సినిమాలలో ఆపద్బాంధవుడు ఒకటి.

అలాగే డాడీ సినిమాలో కూడా ఆయన నటించిన విధానం ప్రశంసలు అందించాయి. అయితే ఆయన రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ను పక్కనపెట్టి అలాంటి ప్రయోగాలు చేసి ఎక్కువసార్లు బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ ఎదుర్కొన్నారు. అయితే అంతకుముందు స్వయంకృషి లాంటి క్యారెక్టర్స్ కూడా బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయ్యాయి.

అయితే మెగాస్టార్ రేంజ్ మారిన తరువాత మాత్రం అలాంటి పాత్రలలో చూడడానికి ఆడియన్స్ ఇష్టపడడం లేదా? లేదంటే చిరంజీవి ఇంకా పదునైన ప్రయోగాల కథలను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉందా? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాలో కమర్షియల్ మాస్ క్యారెక్టర్ బాగానే వర్కౌట్ అయ్యింది.

అయితే అంతకు ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ తన వయసుకు తగ్గ పాత్రతోనే సక్సెస్ అందుకోవాలని అనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక భోళా శంకర్ సినిమాలో కంప్లీట్ స్టైలిష్ క్యారెక్టర్ తో మెప్పించే ప్రయత్నం చేశారు. అది కూడా రివర్స్ అయ్యింది. ఇక మెగాస్టార్ రాబోయే విశ్వంభర సినిమాలో మాత్రం తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా అడ్వెంచర్ ఫాంటసీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒకప్పుడు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో ఎలాంటి అనుభూతిని ఇచ్చారో ఇప్పుడు కూడా అదే తరహాలో ఆకట్టుకుంటారు అని టాక్స్ వినిపిస్తున్నాయి. కానీ మెగాస్టార్ క్యారెక్టర్ అందులో మరీ ఎక్కువగా కాకుండా అలాగని మరియు ఓల్డ్ గా కాకుండా ఒక మిడిల్ ఏజ్ లో ఉంటుందని తెలుస్తోంది. కానీ ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్ అలా కనిపించిన ప్రతిసారి పెద్దగా ఆసక్తి చూపించలేదు. మరి ఈసారి చిరంజీవి రెగ్యులర్ ఫార్మాట్ ను పక్కనపెట్టి చేస్తున్న క్యారెక్టర్ తో సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి.