విశ్వంభర విషయంలో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే దానికంటే ముందే చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేసిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 29 Jun 2025 11:30 AM ISTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే దానికంటే ముందే చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేసిన సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తై చాలా రోజులే అవుతుంది. వాస్తవానికి విశ్వంభర ఇప్పటికే రిలీజవాల్సింది కానీ పలు కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమవుతూ వస్తుంది.
గతేడాది ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా విశ్వంభర నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ లోని వీఎఫ్ఎక్స్ పై భారీ విమర్శలు రావడంతో మేకర్స్ ఏకంగా ఆ టీమ్ నే మార్చేసి కొత్తవారికి వీఎఫ్ఎక్స్ బాధ్యతలు అప్పగించింది. టీజర్ తో వచ్చిన ట్రోలింగ్ వల్ల విశ్వంభర యూనిట్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు విశ్వంభర నుంచి రామ రామ అనే లిరికల్ తప్ప మరో అప్డేట్ వచ్చింది లేదు.
ఇప్పుడు మళ్లీ చిరంజీవి బర్త్ డే వస్తోంది. గతేడాది చిరూ బర్త్ డే కు టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ ఈ ఏడాది బర్త్ డే కు సినిమాను రిలీజ్ చేస్తారనుకుంటే అసలు దాని గురించి అప్డేట్ లేకపోగా చిరంజీవి పాత సినిమా స్టాలిన్ ను రీరిలీజ్ చేస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజైన టైమ్ లో అంచనాలను అందుకోలేకపోయినా ఆ సినిమాలో ఫ్యాన్స్ కు కావాల్సిన స్టఫ్ చాలానే ఉంది.
స్టాలిన్ రీరిలీజ్ ఫ్యాన్స్ కు సంతోషాన్నిస్తున్నా, వారు వెయిట్ చేస్తుంది పాత సినిమాల రీరిలీజుల కోసం కాదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న విశ్వంభర రిలీజ్ గురించి. కానీ విశ్వంభర దర్శకనిర్మాతలు మాత్రం రిలీజ్ డేట్ గురించి కాదు కదా అసలు సినిమా గురించి ఏ చిన్న అప్డేటూ ఇవ్వడం లేదు. గత 10 నెలల నుంచి వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయంటున్నారు తప్పించి దానికి సంబంధించిన అప్డేట్ కూడా లేదు.
ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ మాత్రం చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూసి అసలు విశ్వంభర ఈ ఇయర్ రిలీజవుతుందా అని ఫ్యాన్స్ కు అనుమానాలొస్తున్నాయి. ఇంత జరుగుతున్నా చిరూ మాత్రం అవేమీ పట్టించుకోకుండా అనిల్ రావిపూడి సినిమాను చకచకా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. చూస్తుంటే విశ్వంభర కంటే ముందు అనిల్ రావిపూడి సినిమానే థియేటర్లలోకి వస్తుందా అనే డౌట్స్ కూడా ఫ్యాన్స్ వెల్లిబుచ్చేలా ఉన్నారు.
