విశ్వంభర కోసం అన్నయ్య పాట కాదట..
అయితే ఈ స్పెషల్ సాంగ్ చిరూ సూపర్‌హిట్ సినిమా అయిన అన్నయ్య లోని ఆట కావాలా పాట కావాలా సాంగ్ కు రీమిక్స్ వెర్షన్ అని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి.
By: Tupaki Desk | 15 July 2025 12:23 PM ISTభోళా శంకర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన తర్వాతి సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట తో ఓకే చేసుకున్న సంగతి తెలిసిందే. విశ్వంభర అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందుతుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ వీఎఫ్ఎక్స్ కారణంగా విశ్వంభర వాయిదా పడుతూ వచ్చింది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తైంది. వీఎఫ్ఎక్స్ వర్క్స్ వల్లే విశ్వంభర ఆలస్యమవుతుందని తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని, ఇంకా ఆ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ పెండింగ్ ఉందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ స్పెషల్ సాంగ్ చిరూ సూపర్‌హిట్ సినిమా అయిన అన్నయ్య లోని ఆట కావాలా పాట కావాలా సాంగ్ కు రీమిక్స్ వెర్షన్ అని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి.
కానీ ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. విశ్వంభరలోని స్పెషల్ సాంగ్ ఆట కావాలా పాట కావాలాకు రీమిక్స్ కాదని, ఖైదీ మూవీలోని రగులుతోంది మొగలిపొద సాంగ్ కు రీమిక్స్ వెర్షన్ అని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత మేరకు నిజముందనేది తెలియదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం సాంగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉండటం ఖాయం.
ఈ స్పెషల్ సాంగ్ లో చిరూ సరసన బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ కాలు కదపనున్నట్టు ఇప్పటికే లీకులందాయి. విశ్వంభరకు మ్యూజిక్ కంపోజ్ చేసిన కీరవాణి కాకుండా ఈ స్పెషల్ సాంగ్ ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయనున్నారని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందనేది తెలియాలంటే మాత్రం విశ్వంభర టీమ్ క్లారిటీ ఇవ్వాల్సిందే.
