విశ్వంభరలో రికార్డ్ లెవెల్ V.F.X షాట్స్..!
మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాను డైరెక్టర్ వశిష్ట చాలా ఫోకస్ తో తెరకెక్కిస్తున్నారు.
By: Tupaki Desk | 1 July 2025 4:23 PMమెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాను డైరెక్టర్ వశిష్ట చాలా ఫోకస్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమాను అసలైతే ఈ ఇయర్ సంక్రాంతికి తీసుకు రావాలని అనుకోగా అది కుదరలేదు. ఐతే విశ్వంభర సినిమా విజువల్ వండర్ గా రాబోతుందని తెలిసిందే. ఐతే విశ్వంభర సినిమా రిలీజ్ లేట్ అవ్వడం వెనక రీజన్ డైరెక్టర్ వశిష్ట చెప్పుకొచ్చారు.
విశ్వంభర సినిమా కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఒక సాంగ్ మినహా షూటింగ్ అంతా పూఎర్తైంది. ఐతే సినిమాలో దాదాపు 4676 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ ఉన్నాయని. తెలుగు సినిమాల్లో ఈ రేంజ్ వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ వాడిన సినిమాగా విశ్వంభర రికార్డ్ సృష్టిస్తుందని అన్నారు. ఈ వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ కోసమే సినిమా రిలీజ్ లేట్ అవుతుందని చెప్పారు వశిష్ట.
విశ్వంభర సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ని చాలా వి.ఎఫ్.ఎక్స్ స్టూడియోస్ పనిచేస్తున్నాయన్న విషయాన్ని వెల్లడించారు వశిష్ట. ఆడియన్స్ కు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చి విశ్వంభర వరల్డ్ లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా సినిమా చేస్తున్నట్టు తెలిపారు. సో వశిష్ట క్లారిటీతో విశ్వంభర సినిమాపై ఉన్న డౌట్స్ తీసినట్టే అని చెప్పొచ్చు.
డైరెక్టర్ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే తప్పకుండా సినిమా బాగా వచ్చినట్టే అనిపిస్తుంది. భోళా శంకర్ తర్వాత చిరంజీవి విశ్వంభర సినిమా కోసం రెండేళ్లు టైం తీసుకున్నారు. ఐతే ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉండగా సినిమాతో నెక్స్ట్ లెవెల్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న విశ్వంభర నుంచి త్వరలో ఒక టీజర్ తో పాటు సినిమా రిలీజ్ ని కూడా అందులో రివీల్ చేస్తారని తెలుస్తుంది.
బింబిసార తో తొలి ప్రయత్నంతోనే సూపర్ హిట్ అందుకున్న వశిష్ట. కేవలం ఒక సినిమా అనుభవం ఉన్నా కూడా మెగాస్టార్ చిరంజీవికి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చేశాడు. విశ్వంభర సినిమా పై చిరంజీవి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అన్నది చూడాలి. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు. ఆ మూవీని నాని నిర్మిస్తున్నాడన్న విషయం తెలిసిందే.