విశ్వంభర అదంత ఈజీ కాదంతే..?
ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల్లో గ్రాఫిక్స్ ని కూడా చూసే వెసులు బాటు ఉంది కాబట్టి కచ్చితంగా విశ్వంభర సినిమాను వాటితో పోల్చే ఛాన్స్ ఉంటుంది.
By: Tupaki Desk | 28 May 2025 7:00 AM ISTమెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఐతే ఈ సినిమాను అసలైతే ఈ సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ అది కుదరలేదు. సమ్మర్ కైనా వస్తుందనుకున్న మెగా ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు.
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా విశ్వంభర రిలీజ్ ఉంటుందని అంటున్నారు. అది కూడా అఫీషియల్ గా చెప్పలేదు. ఐతే విశ్వంభర సినిమా గ్రాఫిక్స్ కి ఎక్కువ టైం తీసుకుంటున్నారని తెలుస్తుంది. సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ సినిమాకు చాలా ఇంపార్టెంట్ అనే కారణంతోనే కాస్త ఎక్కువ ఫోకస్ తో ఆ పనులు చేస్తున్నారట. ఐతే ఈమధ్య గ్రాఫిక్స్ తో కూడిన సినిమాల విషయంలో కూడా ఆడియన్స్ చాలా అబ్సర్వేట్ చేస్తున్నారు.
ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల్లో గ్రాఫిక్స్ ని కూడా చూసే వెసులు బాటు ఉంది కాబట్టి కచ్చితంగా విశ్వంభర సినిమాను వాటితో పోల్చే ఛాన్స్ ఉంటుంది. మరి విశ్వంభర టీం ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నది చూడాలి. మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోకసుందరి సినిమా రేంజ్ లో విశ్వంభర ని తెరకెక్కిస్తున్నారు. ఐతే ఈ సినిమా వచ్చి 30 ఏళ్ల పైన అవుతుంది సో ఇప్పుడు విశ్వంభరతో నెక్స్ట్ లెవెల్ టార్గెట్ పెట్టారని తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమా మీద చాలా హోప్స్ తో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా ఆయన పార్ట్ పూర్తి కాగా నెక్స్ట్ చేస్తున్న అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు చిరు. ఐతే విశ్వంభర రిలీజ్ ఎప్పుడు సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలు పెడతారు అన్నది తెలియాల్సి ఉంది. త్రిష తో పాటు ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ లు కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారని తెలుస్తుంది. విశ్వంభర సినిమా మరోసారి ఆడియన్స్ కి ఒక సూపర్ విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రాబోతుంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను అందుకుంటే మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలు క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
