Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమా.. విశ్వక్ సేన్ రీమేక్ కోరిక!

యంగ్ హీరో విశ్వక్ సేన్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   24 May 2024 6:12 AM GMT
ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమా.. విశ్వక్ సేన్ రీమేక్ కోరిక!
X

యంగ్ హీరో విశ్వక్ సేన్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. భిన్నమైన కథలతో మూవీస్ చేస్తూ యూత్ లో మంచి ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోగా ఉన్నాడు. ఇప్పటికే దాస్ కా దమ్కీ, గామి సినిమాల సక్సెస్ తో జోరు మీద ఉన్న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో హ్యాట్రిక్ సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు.

దీని తర్వాత విశ్వక్ చేతిలో మరో మూడు సినిమాల వరకు ఉన్నాయి. అవన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ గానే తెరకెక్కుతూ ఉండటం విశేషం. ఇవి కూడా సక్సెస్ అయితే విశ్వక్ సేన్ మరో రేంజ్ కు వచ్చేస్తాడనే మాట వినిపిస్తోంది. మే 31న రిలీజ్ కాబోయే తన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. యాంకర్ సుమకి టీమ్ తో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

అయితే విశ్వక్ సేన్ జూనియర్ ఎన్టీఆర్ కి హార్డ్ కొర్ ఫ్యాన్ అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కూడా విశ్వక్ సినిమాల ఈవెంట్స్ కి వచ్చి దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉంటాడు. దీంతో ఇద్దరి మధ్య బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. వీరు అప్పుడప్పుడు హోమ్ పార్టీలలో కూడా పాల్గొంటారు. ప్రతీ ఈవెంట్ లో కూడా విశ్వక్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు గట్టిగానే ఉంటుందని చెప్పవచ్చు.

ఇక తాజాగా సుమ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమాలలో నువ్వు ఏదైనా రీమేక్ చేయాలని అనుకుంటే దేనిని సెలక్ట్ చేసుకుంటావ్ అని అడిగారు. అందుకు విశ్వక్ సేన్ ఏమాత్రం తడబడకుండా వెంటనే నా అల్లుడు మూవీ రీమేక్ చేస్తానని చెప్పి షాక్ ఇచ్చాడు. ఆ సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో నా అల్లుడు ఒకటి. అలాంటి సినిమాని రీమేక్ చేస్తానని చెప్పడంపై ఆసక్తికర కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నా అల్లుడు తనకి బాగా ఇష్టమైన సినిమాలలో ఒకటని, దాంట్లో కొన్ని మార్పులు చేసి రీమేక్ చేస్తే కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని విశ్వక్ సేన్ చెప్పాడు. నిజానికి విశ్వక్ చెప్పిన మాట వాస్తవమే. అందులో ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ అద్బుతంగా ఉంటుంది. ఇక రమ్యకృష్ణతో వచ్చే మాస్ సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. జెనీలియా శ్రియ.. ఇద్దరితో ఎన్టీఆర్ రొమాంటిక్ కామెడీ ట్రాక్ కూడా బాగుంటుంది.

అందుకే విశ్వక్ కొన్ని మార్పులు చేసి ఆ సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి రాబోయే రోజుల్లో విశ్వక్ ఎన్టీఆర్ సినిమాలను రీమేక్ చేయకపోయినా దేన్నైనా అనుకరిస్తాడేమో చూడాలి.