Begin typing your search above and press return to search.

విశ్వక్ గామి.. ఇంతవరకు ఎవరు వినని కథ

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేలా చూసుకుంటాడు అని చెప్పవచ్చు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 10:34 AM GMT
విశ్వక్ గామి.. ఇంతవరకు ఎవరు వినని కథ
X

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేలా చూసుకుంటాడు అని చెప్పవచ్చు. అతని భిన్నమైన లైనప్ తో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. అలాగే ప్రతీ సినిమాలో కూడా తన పాత్ర నెవ్వర్ బిఫోర్ లా ఉండేలా చూసుకుంటున్నారు. వాటిలో ఒకటి గామి. దర్శకుడు విద్యాధర్ కగిట ఈ చిత్రాన్ని అడ్వెంచర్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.

అనౌన్స్మెంట్ తోనే పాజిటివ్ బజ్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ఫినిష్ అయ్యింది. ఆ మధ్య హైదరాబాద్ లో కామిక్‌ కాన్‌ మూవీ ఫెస్టివల్ లో గామి ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేశారు. అప్పుడే సినిమా కాన్సెప్ట్ పై ఒక హింట్ ఇచ్చారు. "అతడి అతి పెద్ద భయం మానవ స్పర్శ. అతడి లోతైన కోరిక కూడా మానవ స్పర్శ" అంటూ మూవీ పై క్యూరియాసిటీ పెంచింది టీమ్.

విశ్వక్ సేన్ క్రౌడ్ ఫండెడ్ అడ్వెంచర్ డ్రామాగా రానున్న గామితో అతను అఘోరా పాత్రలో కనిపిస్తాడు. ఇక సినిమాలో విశ్వక్ పాత్ర అరుదైన వ్యాధితో బాధపడుతుందట. అతను మానవ స్పర్శను అనుభవించలేడట. ఇక అతను నివారణ కోసం హరిద్వార్ నుండి హిమాలయాలకు వెళ్లాల్సి వస్తుందట. అతని శారీరక సమస్యకు నివారణ కోసం ఈ అన్వేషణ అంతర్గత ప్రయాణానికి కూడా దారి తీస్తుంది.

ఆ విధంగా సాగే ఈ సినిమా చాలా ఆలోచింపజేసే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కథతో ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు. సినిమా చాలా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 2017 మధ్యలో ప్రారంభమైన గామి రచన ప్రక్రియ 2018 మధ్యలో పూర్తయింది. చాందిని చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఎంజి అభినయ, మహమ్మద్ సమద్ మరియు హారిక పెడదా కీలక పాత్రలు పోషించారు. ఇక గామి సినిమాను మార్చి8 8న విడుదల చేయాలని అనుకుంటున్నారు.

కార్తీక్ శబరీశ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వీ సెల్యులాయిడ్ బ్యానర్ సమర్పిస్తోంది. గామి చిత్రం కోసం నాలుగేళ్లగా పని చేస్తున్నామని ఇటీవలే విశ్వక్ చెప్పారు. ఈ సినిమాలో ఆయన శంకర్ అనే అఘోరగా నటిస్తున్నారట. ఆయన క్యారెక్టర్‌ చాలా విచిత్రంగా ఉండబోతుందని పోస్టర్ టీజర్ ద్వారా అర్ధమవుతోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.