Begin typing your search above and press return to search.

గామిపై నెగిటివ్ ప్రచారం.. ఇచ్చి పడేసిన విశ్వక్

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుస షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.

By:  Tupaki Desk   |   12 March 2024 7:34 AM GMT
గామిపై నెగిటివ్ ప్రచారం.. ఇచ్చి పడేసిన విశ్వక్
X

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుస షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా. మంచి టాక్ అందుకున్న గామి మూవీ.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసేసుకుంది.


అయితే ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే క్రిటిక్స్ తోపాటు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ కొంతమంది కావాలనే ఈ సినిమాపై నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ టికెట్ సెల్లింగ్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ బుక్ మై షోలో ఫేక్ అకౌంట్స్ ద్వారా 0 లేదా 1 రేటింగ్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే మూవీ యూనిట్ గుర్తించింది. మహేశ్ బాబు గుంటూరు కారం, విజయ్ దేవరకొండ ఖుషీ మూవీలకు కూడా ఇలానే జరిగింది.

తాజాగా గామి కూడా ఇదే రిపీట్ అవ్వడంతో విశ్వక్ సేన్ సీరియస్ గా స్పందించారు. గామిని హిట్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ ఫేక్ అకౌంట్స్ ద్వారా రేటింగ్స్ ఇస్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. "నా గామి సినిమాకు ఇంతటి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు, మూవీ లవర్స్ కు నా కృతజ్ఞతలు. ఇప్పుడు నా దృష్టికి వచ్చిన ఒక సమస్య గురించి ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నాను" అంటూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.

"బుక్‌ మైషో వంటి ప్లాట్‌ ఫామ్స్ లో చలనచిత్ర ఖ్యాతిపై నిరంతర దాడులు జరుగుతున్నాయని నా దృష్టికి వచ్చింది. ఫేక్ అకౌంట్స్ తో 10కు 1 రేటింగ్ ఇచ్చి సినిమాను దెబ్బ తీయాలని చూస్తున్నారు కొందరు. వాళ్లు ఫేక్ రేటింగ్స్ ఇవ్వడం వల్ల మూవీకి మంచి రేటింగ్స్ ఇచ్చినా అవి పడిపోతున్నాయి. మీరు నన్ను ఎన్నిసార్లు కిందకు లాగడానికి కొన్ని గంటలకు పాటు ప్రయత్నించినా చాలా డేంజర్ గా మళ్లీ పైకి వస్తాను" అని హెచ్చరించారు.

అయితే ఇలాంటి సమయంలో మంచి సినిమా వస్తే సపోర్ట్ చేసిన సినీ ప్రేక్షకులకు, మీడియాకు, విమర్శకులకు ధన్యవాదాలు తెలిపారు విశ్వక్. ఈ ఫేక్ రేటింగ్ ఇష్యూపై త్వరలోనే తాను లీగల్ గా ముందుకు వెళ్తానని క్లారిటీ ఇచ్చారు. ఇక గుంటూరు కారం విషయంలో కూడా ఆ సినిమా మేకర్స్.. బుక్ మై షో ప్లాట్ ఫామ్ కు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు విశ్వక్ రంగంలోకి దిగాక.. ఏం జరుగుతుందో చూడాలి.