Begin typing your search above and press return to search.

విశ్వక్ సేన్ చైల్డ్ యాక్టర్ గా చేసాడని తెలుసా?

వెళ్ళిపోమాకే సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఈ నగరానికి ఏమైంది చిత్రంతో సక్సెస్ కొట్టిన నటుడు విశ్వక్ సేన్.

By:  Tupaki Desk   |   17 Feb 2024 9:19 AM GMT
విశ్వక్ సేన్ చైల్డ్ యాక్టర్ గా చేసాడని తెలుసా?
X

వెళ్ళిపోమాకే సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఈ నగరానికి ఏమైంది చిత్రంతో సక్సెస్ కొట్టిన నటుడు విశ్వక్ సేన్. ఈ మూవీ తర్వాత ఫలక్ నుమా దాస్ సినిమాతో సోలోగా విశ్వక్ సేన్ సూపర్ హిట్ కొట్టాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస మూవీస్ తో దూసుకుపోతున్నాడు. గత ఏడాది దాస్ కా ధమ్కీ మూవీతో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు.


ఇదిలా ఉంటే ప్రస్తుతం విశ్వక్ సేన్ నటించిన గామి రిలీజ్ కి రెడీ అవుతోంది. దీంతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా రిలీజ్ కానుంది. గామి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. మూవీలో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. గామి మూవీ నటుడిగా విశ్వక్ సేన్ కి డిఫరెంట్ ఇమేజ్ ని తీసుకొని వస్తుందని భావిస్తున్నారు.

ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఛానల్స్ కి విశ్వక్ సేన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలో విశ్వక్ ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు. తాను చైల్డ్ యాక్టర్ గా ఒక సినిమాలో నటించానని చెప్పుకొచ్చాడు. తనకి చిన్న వయస్సు నుంచి సినిమాలలో నటించాలనే కోరిక ఉందని అందుకే అవకాశాల కోసం ప్రయత్నం చేసేవాడిని అని క్లారిటీ ఇచ్చాడు.

జోష్ సినిమా ఆడిషన్స్ కి వెళ్లానని, అయితే అందులో ఛాన్స్ రాలేదని చెప్పాడు. ఆ సమయంలో మరీ చిన్నపిల్లాడిలా కనిపిస్తున్న అని అవకాశం ఇవ్వలేదని అన్నాడు. తరువాత దాసరి గారు ఒక సినిమా నిర్మిస్తున్నారని తెలిస్తే నా ఫోటో పంపించాను. అలా జగపతిబాబు నటించిన బంగారుబాబు సినిమాలో సెలక్ట్ అయ్యాను.

దిల్ సుఖ్ నగర్ లో ఉండే నన్ను ఓ వ్యాన్ వచ్చి ఎక్కించుకొని రామోజీ ఫిలిం సిటీకి తీసుకొని వెళ్ళింది. అదే నా ఫస్ట్ సెట్ ఎక్స్ పీరియన్స్. హీరో చిన్నప్పుడు అతన్ని చెడగొట్టే గ్యాంగ్ లో నేను కూడా ఉంటా. ఒక్క రోజులోనే షూటింగ్ అయిపొయింది. ఆ మూవీలో నటించినందుకు నాకు రెమ్యునరేషన్ గా 900 ఇచ్చారు. అలా చైల్డ్ యాక్టర్ గానే సినిమాలో కనిపించాను అని చెప్పుకొచ్చాడు.