విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ టాక్.. ఎలా ఉందంటే..
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. చాలా రోజులుగా ఓ వర్గం ఆడియెన్స్ లో క్యూరియాసిటి క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ మొత్తానికి విడుదలైంది.
By: M Prashanth | 7 Aug 2026 6:27 PM ISTసూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. చాలా రోజులుగా ఓ వర్గం ఆడియెన్స్ లో క్యూరియాసిటి క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ మొత్తానికి విడుదలైంది. ఇక ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై బజ్ మళ్ళీ పెరిగేలా ఉంది. సూర్య సంజయ్ విశ్వనాథ్ అనే ఇంటర్నేషనల్ పిస్టల్ షూటర్ పాత్రలో కనిపిస్తున్నారు.
ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యంతో సంజయ్ ప్రయాణం మొదలవుతుంది. ఆ తర్వాత కథలో ఒక ఎమోషనల్ టర్న్ వస్తుంది. అభయ్ అనే చిన్న పిల్లాడికి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరం కావడం, డోనర్ కోసం వారు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లడం ట్రైలర్ లో చూపించారు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఆపరేషన్ అనగానే మనసు కదిలిపోతుంది. ఈ ట్రాక్ సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలుస్తుందని అర్థమవుతుంది.
ఈ సినిమాలో సూర్య లుక్స్ చాలా కొత్తగా, స్టైలిష్ గా ఉన్నాయి. డబ్బు, స్టేటస్ అన్నీ మనకు సౌకర్యం అవ్వాలి, అహంకారం కాకూడదు అని ఆయన చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ మ్యాన్ గా, స్పోర్ట్స్ పర్సన్ గా రెండు వేరియేషన్స్ లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కళ్ళలో కనిపించే బాధ, లక్ష్యం సాధించాలనే కసి రెండూ స్క్రీన్ పై బాగా పండాయి. నాచురల్ గా నటించారు.
హీరోయిన్ మమితా బైజు స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్ కు ఫుల్ పాజిటివ్ వైబ్ తీసుకొచ్చింది. సూర్యతో ఆమె కెమిస్ట్రీ చాలా క్యూట్ గా వర్కౌట్ అయింది. ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ కనిపిస్తోంది. ఆ లవ్ కెమిస్ట్రీ హైలెట్ కానున్నట్లు అర్థమవుతుంది. ఒక పూల్ లో ఆమెను సూర్య తోసేసే సీన్ సరదాగా ఉంది. నువ్వు నన్ను మిస్ అవుతావా అని పిల్లాడిని ఆమె అడిగే సీన్ బాగుంది.
చివర్లో సూర్య బొమ్మ కార్లు పట్టుకుని ఆడుకుంటుంటే, చంద్రముఖిలో జ్యోతికలా బిహేవ్ చేస్తున్నావ్ ఏంటి అని వేసే పంచ్ నవ్విస్తుంది. వెంకీ అట్లూరి రాసిన డైలాగ్స్ ఈ ట్రైలర్ కు అసలైన ప్రాణం పోశాయి. "మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదండీ, ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక" అని సూర్య చెప్పిన మాట నేరుగా మనసుకు హత్తుకుంటుంది. గెలిచేదాకా ఆపకూడదు, గెలిచిన తర్వాత ఆ గెలుపు గురించి ఎక్కువగా మాట్లాడుకోకూడదు అనే డైలాగ్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.
ఇక జివి ప్రకాష్ కుమార్ ఇచ్చిన మ్యూజిక్ ఎమోషనల్ సీన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. విజువల్స్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీగా నిర్మించాయి. రాధికా శరత్ కుమార్ తో పాటు ఇతర నటీనటులు తమ తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. యాక్షన్, స్పోర్ట్స్, ఫ్యామిలీ డ్రామా లాంటి అంశాలు అన్నీ కరెక్ట్ గా మిక్స్ చేసిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకునే అవకాశం ఉంది. మరి థియేటర్స్ లో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.
