Begin typing your search above and press return to search.

26 నుంచి విశ్వంభ‌రుడి విశ్వ‌రూపం!

ఈనెల 26 నుంచి హైద‌రాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభ‌మ వుతుంది. ఇందులో చిరంజీవితో పాటు కీల‌క న‌టులంతా పాల్గొంటార‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 7:30 AM GMT
26 నుంచి విశ్వంభ‌రుడి విశ్వ‌రూపం!
X

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వశిష్ట ద‌ర్శ‌క‌త్వంలో 'విశ్వంభ‌ర‌' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొన్ని కీల‌క షెడ్యూల్స్ పూర్తి చేసారు. మారుడుమిల్లి..హైద‌రాబాద్ స‌హా ప‌లు ప్రాంతాల్లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఇక హైద‌రాబాద్ లో భాగంగా ఏకంగా 13 ప్ర‌త్యేక‌మైన సెట్లు నిర్మించి అక్క‌డా కొంత భాగం షూటింగ్ చేసారు. ఆ సెట్ల కోసం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసారు. సోషియా ఫాంట‌సీ చిత్రం కావ‌డంతో మాయావ‌నం లాంటి సెట్లు నిర్మించి అక్క‌డే ప్ర‌త్యేక‌మైన స‌న్ని వేశాలు చిత్రీక‌రించారు.

అయితే ఇంకా చాలా సెట్స్ లో షూటింగ్ చేయాల్సి ఉంది. ఈనేప‌థ్యంలో చిత్ర యూనిట్ విరామం ప్ర‌క టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో చిరంజీవి అమెరికాకి వెకేష‌న్ కి వెళ్లి తిరిగొ చ్చారు. దీంతో కొత్త షె డ్యూల్ కి యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. ఈనెల 26 నుంచి హైద‌రాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభ‌మ వుతుంది. ఇందులో చిరంజీవితో పాటు కీల‌క న‌టులంతా పాల్గొంటార‌ని తెలుస్తోంది.

స్టోరీ డిమాండ్ మేర‌కు మ‌రో ఐదుగురు భామ‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇషాచావ్లా..సుర‌భి ల‌ను ఎంచుకున్న‌ట్లు స‌మాచారం. తాజా షెడ్యూల్స్ చిరంజీవితో పాటు వాళ్లు కూడా పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే చిరుకి జోడీగా త్రిష‌ని తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆమె కూడా షూట్ లో భాగ‌మ‌వుతుంది. తాజా షెడ్యూల్ అంతా రంగుల‌మయంగానే హైలైట్ అవుతుంద‌ని చెప్పొచ్చు.

అలాగే కొన్ని కీల‌కమైన పోరాట స‌న్నివేశాలు ఈ షెడ్యూల్ లో చిత్రీక‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. అందు కోసం ప్ర‌ముఖ స్టంట్ మాస్ట‌ర్ల‌ని రంగంలోకి దించుతున్నారుట‌. చిరంజీవి ఇటీవ‌ల వ‌ర్కౌట్ చేసిన వీడి యోలు నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ వ‌ర్కౌట్లు అన్ని ఈ కొత్త షెడ్యూల్ లో షురూ చేయ‌బో తున్నార‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.