Begin typing your search above and press return to search.

విశ్వంభర.. అసలు ట్విస్ట్ ఏమిటంటే?

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రిష ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తుందనే టాక్ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   11 March 2024 4:02 AM GMT
విశ్వంభర.. అసలు ట్విస్ట్ ఏమిటంటే?
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ విశ్వంభర. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో సిద్ధం అవుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా త్రిష కృష్ణన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె షూటింగ్ లో జాయిన్ అయ్యింది.

హైదరాబాద్ నగర శివార్లలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారంట. హైవోల్టేజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలో ఈ సినిమా ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. బింబిసారా తర్వాత వశిష్ట నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ నుంచి బయటకొచ్చి ఈ మూవీ చేస్తున్నారు.

దీంతో కచ్చితంగా విశ్వంభర మూవీ వండర్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందనే అభిప్రాయం మెగా ఫ్యాన్స్ లో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రిష ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తుందనే టాక్ నడుస్తోంది. రెండు భిన్నమైన పాత్రలలో ఆమె కనిపించనుందంట. ఒక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ కి ఇలా రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశం రావడం చాలా రేర్ అని చెప్పాలి.

అయితే త్రిషకి విశ్వంభర మూవీలో అలాంటి అరుదైన అవకాశం లభించింది. ఈ రెండు కూడా మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలే అని తెలుస్తోంది.. అదే నిజమైతే త్రిషకి విశ్వంభర చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక మూవీలో కీలక పాత్రలలో సురభి, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, అశ్రిత వేముగంటి కనిపించబోతున్నారు. ఆషికా రంగనాథ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోందని టాక్.

ఈ చిత్రంలో మెగాస్టార్ కి ప్రతినాయకుడిగా ఎవరు కనిపించబోతున్నారు అనేది ఇప్పటి వరకు రివీల్ కాలేదు. ఆ క్యారెక్టర్ కోసం ఈ స్టార్ యాక్టర్ ని రంగంలోకి దించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. విశ్వంభర బడ్జెట్ కూడా వేసుకున్న లెక్కలు కంటే దాటిపోయే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అదేంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి.