Begin typing your search above and press return to search.

చిరు 'విశ్వంభర' గురించి ఈ విషయం మీకు తెలుసా..!

బింబిసార సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ దర్శకుడు చిరంజీవి ని కొత్తగా ఫ్యాన్స్ కి చూపిస్తాను అంటున్నాడు.

By:  Tupaki Desk   |   9 Nov 2023 9:17 AM GMT
చిరు విశ్వంభర గురించి ఈ విషయం మీకు తెలుసా..!
X

మెగాస్టార్‌ చిరంజీవి భోళా శంకర్ సినిమా నిరాశ పర్చడంతో తదుపరి సినిమా విషయంలో చాలా చర్చలు, సంప్రదింపులు జరిపి చివరకు యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ సినిమా ను చేసేందుకు రెడీ అయ్యాడు. బింబిసార సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ దర్శకుడు చిరంజీవి ని కొత్తగా ఫ్యాన్స్ కి చూపిస్తాను అంటున్నాడు.

ఈ సినిమా ప్రకటించి చాలా రోజులు అయింది. చిరంజీవి వేరు వేరు కారణాల వల్ల అందుబాటులో లేకపోవడం వల్ల షూటింగ్‌ ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాను ప్రారంభించేందుకు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు రెడీ అవుతున్నారు. మీడియా సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం మేరకు నవంబర్‌ 20న ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు లాంచనంగా జరుగబోతున్నాయి.

ఇక ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ను డిసెంబర్‌ లో మొదలు పెట్టబోతున్నాడు. చిరంజీవి జాయిన్‌ అయినా.. కాకున్నా కూడా డిసెంబర్‌ లో చిరు 'విశ్వంభర' షూటింగ్‌ జరుగుతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. చిరు ఏదైనా సమస్య వల్ల షూటింగ్ కి హాజరు కాకుంటే ఆయన లేని సన్నివేశాల చిత్రీకరణ చేసే అవకాశాలు ఉన్నాయి.

బింబిసార తరహాలో విభిన్నమైన కాన్సెప్ట్‌ మరియు కథతో ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించబోతున్నాడు. చిరు ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఈ సినిమా పై ఆసక్తిని కనబర్చుతున్నారు. మరి వశిష్ట ఏం చేసేనో చూడాలి.