Begin typing your search above and press return to search.

'విశ్వంభర' కి బురద కష్టాలు..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   18 March 2024 7:09 AM GMT
విశ్వంభర కి బురద కష్టాలు..!
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో భారీ స్టార్‌ కాస్ట్‌ నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా బ్రేక్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్‌ చేస్తున్నారు.

మొన్నటి వరకు పాట చిత్రీకరణ లో పాల్గొన్న విశ్వంభర యూనిట్‌ సభ్యులు ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుడా వెంటనే యాక్షన్ మూడ్‌ లోకి వెళ్లి పోయారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేక సెట్టింగ్‌ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్లు యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తుంది.

ఇన్ని రోజులు విశ్వంభర సినిమా షూటింగ్‌ సాఫీగా సాగింది. అయితే ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తున్న యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ మాత్రం కాస్త కఠినంగా మారిందట. కథ డిమాండ్ మేరకు ఈ యాక్షన్ సన్నివేశంను బురద, దుమ్ములో చిత్రీకరిస్తున్నారట.

చిరంజీవి డూప్‌ ను ఉపయోగించకుండా ఈ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. స్వయంగా చిరంజీవి పదుల సంఖ్యలో ఫైటర్స్ తో బురద, దుమ్ము మరియు నీటి లో పోరాటం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. షూటింగ్‌ కోసం ప్రత్యేకంగా బురద తయారు చేసినా కూడా షూటింగ్‌ సమయంలో యూనిట్‌ సభ్యులకు ఏదో ఒక సమస్య వస్తుందట.

అయినా కూడా తగ్గకుండా షూటింగ్‌ ను జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆ షెడ్యూల్‌ సగానికి పైగా పూర్తి అయ్యింది. త్వరలోనే ఆ బ్యాలెన్స్ యాక్షన్ పార్ట్ ను కూడా పూర్తి చేసి తిరిగి టాకీ పార్ట్‌ షూటింగ్ ను నిర్వహించబోతున్నారు.