Begin typing your search above and press return to search.

ఊరిస్తున్న 'విశ్వంభర' కొత్త రూమర్‌

తాజాగా ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీ లో షూట్‌ చేయబోతున్న భారీ యాక్షన్‌ సన్నివేశం గురించి పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   12 Feb 2024 7:49 AM GMT
ఊరిస్తున్న విశ్వంభర కొత్త రూమర్‌
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్‌ గా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. భారీ సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు భారీ ఎత్తున విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఉంటుందట. అందుకే ఈ సినిమా విడుదలకు చాలా సమయం పడుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విశ్వంభర ఫిక్స్ అయిన విషయం తెల్సిందే.

సినిమాను ప్రకటించినప్పటి నుంచి కూడా అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో రోజుకో వార్త ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంత ఉందో.. అబద్ధం ఎంత ఉందో అనే విషయాలు క్లారిటీ లేదు. కానీ ఆ వార్తలు మాత్రం సినిమా పై అంచనాలు మరియు ఆసక్తిని భారీగా పెంచేస్తున్నాయి అనడంలో సందేహం లేదు.

తాజాగా ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీ లో షూట్‌ చేయబోతున్న భారీ యాక్షన్‌ సన్నివేశం గురించి పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ యాక్షన్ సన్నివేశంలో చిరంజీవిని వైల్డ్ గా చూడబోతున్నామని, అంతే కాకుండా అద్భుతమైన విజువల్ వండర్‌ గా యాక్షన్ సన్నివేశం ఉంటుందని కూడా అంటున్నారు.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న విశ్వంభర సినిమాలోని ప్రతి సన్నివేశం.. ప్రతి ఎలిమెంట్‌ కూడా అద్భుతం అన్నట్లుగా ఉంటుందట. అలాంటిది ఆ యాక్షన్‌ సన్నివేశంలో చిరంజీవి లుక్ కూడా ఓ అద్భుతం అన్నట్లుగా ఉండబోతుంది అంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

చాలా కాలం తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ మూవీ అవ్వడంతో పాటు, చాలా కాలం తర్వాత చిరు, త్రిష లు జోడీ కట్టి చేస్తున్న సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి కచ్చితంగా మెగా ఫ్యాన్స్ పండుగ రెట్టింపు అవ్వడం ఖాయం.