మరోసారి చిరూ వర్సెస్ బాలయ్య?
టాలీవుడ్ లో ఈ మధ్య పెద్ద సినిమాలకు రిలీజ్ డేట్ల సమస్య బాగా ఎక్కువైపోతుంది.
By: Tupaki Desk | 4 July 2025 9:00 PM ISTటాలీవుడ్ లో ఈ మధ్య పెద్ద సినిమాలకు రిలీజ్ డేట్ల సమస్య బాగా ఎక్కువైపోతుంది. తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తంగా ఎదిగిన నేపథ్యంలో మేకర్స్ ప్రతీ సినిమానీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారు. దీంతో ప్రతీ ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ఆలస్యమవుతుంది.
దీంతో అనుకున్న టైమ్ కు సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నారు. అయితే సెప్టెంబర్ 25న అఖండ2 ను రిలీజ్ చేయనున్నామని ఆ చిత్ర మేకర్స్ అందరి కంటే ముందుగా ఆ డేట్ పై కర్ఛీఫ్ వేసుకున్నారు. కానీ తర్వాత అదే డేట్ కు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాను కూడా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. దీంతో బాలయ్య వర్సెస్ పవన్ క్లాష్ తప్పదనుకున్నారంతా.
కానీ ఇప్పుడు పవన్ ఆ డేట్ లో రాని పక్షంలో సెప్టెంబర్ 25కు వారం ముందు అంటే సెప్టెంబర్ 18న విశ్వంభరను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో యువి క్రియేషన్స్ నిర్మాతలున్నారట. ఇప్పటివరకైతే ఇంకా కన్ఫర్మ్ అవలేదు. సెప్టెంబర్ లో విశ్వంభర రిలీజ్ అనేది పూర్తిగా ఓజి సినిమా రిలీజ్ పై ఆధారపడి ఉంది. ఒకవేళ ఓజి చెప్పిన డేట్ కు వస్తే విశ్వంభర అసలు బరిలోకి దిగదు.
ఇప్పటివరకైతే ఓజి సెప్టెంబర్ 25 రిలీజనే అంటున్నారు. ఒకవేళ ఏదైనా కారణంతో ఓజి పోస్ట్‌పోన్ అయితే ఆ స్లాట్ ను వాడుకుంటూ సెప్టెంబర్ 18న విశ్వంభర పోటీలోకి వస్తుంది. అదే జరిగితే మరోసారి చిరూ, బాలయ్య మధ్య పోటీ చూసే అవకాశముంటుంది. ఇప్పటివరకు ఇదంతా కేవలం అనుకోవడం దగ్గరే ఉంది తప్పించి కన్ఫర్మ్ అవలేదు. ఇంకా విశ్వంభరకు సంబంధించిన స్పెషల్ సాంగ్ పూర్తవలేదు. ఈ సాంగ్ కోసం మౌనీ రాయ్ ను తీసుకున్నారన్నారు కానీ ఇంకా మేకర్స్ మాత్రం దీనిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
మరోవైపు వీఎఫ్ఎక్స్ పూర్తవాల్సి ఉంది. వీఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తయ్యాకే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేద్దామని వశిష్ఠ వెయిట్ చేస్తున్నారట. రిలీజ్ ఎప్పుడు జరిగినా సరే అప్పుడప్పుడైనా విశ్వంభరకు సంబంధించిన అప్డేట్స్ ను మేకర్స్ ఇస్తే ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉంటారు. లేదు, ఇలానే ఉంటామని మేకర్స్ అంటే రిలీజ్ కు ముందు సరైన హైప్ లేక సినిమా నానా ఇబ్బందులు పడటం ఖాయం.
