ఇరాన్ -ఇజ్రాయెల్ యుద్దం 'విశ్వంభర'కు శాపంగా!
సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ అది సాధ్య పడలేదు. ఆ తర్వాత వేసవి సహా పలు మాసాలు రిలీజ్ పరంగా తెరపైకి వచ్చాయి.
By: Tupaki Desk | 6 Aug 2025 7:00 AM ISTఇరాన్ -ఇజ్రాయెల్ యుద్ధం `విశ్వంభర`కు శాపంగా మారిందా? మెగాస్టార్ సినిమా విడుదల వాయిదాకు ఈ వార్ ప్రధాన కారణమా? అంటే అవుననే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిరంజీవి కథనా యకుడిగా వశిష్ట దర్శకత్వంలో `విశ్వంభర` రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. కానీ ఇంత వరకూ ఆ సినిమా రిలీజ్ అయింది లేదు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ అది సాధ్య పడలేదు. ఆ తర్వాత వేసవి సహా పలు మాసాలు రిలీజ్ పరంగా తెరపైకి వచ్చాయి.
ఇదా అసలు కారణం:
కానీ అదంతా ప్రచారం వరకే పరిమితమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు సోషియా ఫాంటసీ సినిమా కావడంతో సీజీ , వీఎఫ్ ఎక్స్ పనుల కారణంగా రిలీజ్ ఆలస్యమవుతోంది? అన్న అసలు కారణంగా తెరపైకి వచ్చింది. సాధారణంగా టెక్నికల్ అంశాలున్న సినిమా రిలీజ్ కు సమయం ఎక్కువగానే పడుతుంది. రెగ్యులర్ సినిమాల్లా వీటిని రిలీజ్ చేయడం సాధ్యపడదు. వర్క్ అంతా పర్పెక్ట్ గా ఉండాలి. ఔట్ పుట్ విషయంలో పూర్తి సంతృప్తి ఉండాలి. అప్పుడే రిలీజ్ కు ఛాన్స్ ఉంటుంది.
అడుగడుగునా అవరోధాలు:
ఈ విషయంలో దర్శకుడు వశిష్ట మరింత శ్రద్దగా పని చేస్తున్నారు. అన్నయ్య నమ్మి ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలని శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నారు. అయితే తానెంత శ్రమించినా దైవం కూడా ఓ చిన్న చూపు చూడాలి. కానీ ఈ విషయంలో వశిష్టకు అవరోధాలు తప్పడం లేదు. ఈ సినిమాకు సంబం ధించిన సీజీ, వీఎప్ ఎక్స్ పనులు చాలా కంపెనీలకు ఇచ్చారు. రకరకాల కంపెనీలు వివిధ అంశాలపై పని చేస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రధాన బాధ్యతలు ఇరాన్ కు చెందిన ఓ ప్రఖ్యాత కంపెనీకి అప్ప గించారు.
మరో పాట పెండింగ్ లో:
కానీ అదే సమయంలో ఇరాన్ -ఇజ్రాయెల్ మధ్య యుద్దం మొదలవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోయాయి. ఆ కారణంగా నాలుగు నెలల సమయం వృద్దాగా పోయింది. దాంతో పాటు డబ్బు కూడా వృద్ధా ఖర్చుగా మారింది. ఆ తర్వాత అవే పనులు కెనడాకు చెందిన మరో కంపెనీకి అప్పగించారుట. ప్రస్తుతం సీజీ పనులు కెనడా లో జరుగుతున్నట్లు వశిష్ట తెలిపారు. అలాగే సినిమాకు సంబంధించి మరో పాట చిత్రీ కరించాల్సి ఉందిట. ఆ పాట ఈనెల 25 నుంచి చిత్రీకరించనున్నారు. కొంత ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయ ల్సి ఉందిట. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఫైనల్ ఔట్ పుట్ చూసుకున్న అనంతరమే రిలీజ్ తేదీని పక్కాగా ప్రకటించే అవకాశం ఉందని వశిష్ట మాటల్ని బట్టి తెలుస్తోంది.
