తనయుడితో మిస్సైన ఫైటింగ్ తమ్ముడుతోనా?
కానీ తాజాగా అందుతోన్న సమాచారం ఏంటంటే? సెప్టెంబర్ 18 డేట్ లాక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్త లొస్తున్నాయి.
By: Tupaki Desk | 10 July 2025 10:01 PM ISTమెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న `విశ్వంభర` తొలుత జనవరిలో రిలీజ్ అవుతుందని ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అదే సీజన్ లో తనయుడు రామ్ చరణ్ నటించిన `గేమ్ ఛేంజర్` రిలీజ్ ఉండటంతో డాడ్ వెనక్కి తగ్గినట్లు ప్రచారంలోకి వచ్చింది. `విశ్వంభర` వాయిదా వెనుక వాస్తవ కథ వేరే ఉన్నప్పటికీ ప్రచారం మాత్రం ఇలాగే జరిగింది. దీంతో అంతా ఇదే నిజమనుకున్నారు. అసలు సంగ తేంటి? అన్నది ఆ తర్వాతే అర్దమైంది.
ఒకవేళ అప్పటికే `విశ్వంభర` పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయి ఉంటే? సన్నివేశం ఎలా ఉండేదో ఊహకి కూడా రాదు. సంక్రాంతి సీజన్ కాబట్టి రిలీజ్ కు ఎక్కువగానే ఛాన్సెస్ ఉండేవి. ఆ విధంగా తండ్రీ-తనయుల మధ్య క్లాష్ తప్పింది. అయితే అప్పుడు తనయుడితో క్లాష్ తప్పినా? ఈసారి మాత్రం తమ్ముడు ముందు అన్నయ్య కాలు దువ్వడం ఖాయమంటున్నారు. `విశ్వంభర` చిత్రం రిలీజ్ పై ఇంత వరకూ అధి కారికంగా ఎలాంటి సమాచారం లేదు.
సెప్టెంబర్ తర్వాత ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఇప్పటివరకూ ఉన్న సమాచారం. కానీ తాజాగా అందుతోన్న సమాచారం ఏంటంటే? సెప్టెంబర్ 18 డేట్ లాక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్త లొస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే వారం గ్యాప్ లోనే పవన్ కళ్యాణ్ నటిస్తోన్న `ఓజీ` కూడా రిలీజ్ అవు తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే `ఓజీ` వాయిదా పడిన నేపథ్యంలో ఆ తేదీకి తప్పని సరిగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
`ఓజీ` రిలీజ్ తో సంబంధం లేకుండా `విశ్వంభర` మాత్రం 18వ తేదిన బొమ్మ వేసేయాలని నిర్మాతలు మాత్రం స్ట్రాంగ్ ఉన్నారుట. `ఓజీ` కూడా అదే తేదీకి ఫిక్స్ అయితే అన్నదమ్ముల మధ్య వార్ తప్పదు. ఇంత వరకూ చిరు-పవన్ సినిమాలు ఇంత సమీపంగా ఎప్పుడూ రిలీజ్ అవ్వలేదు. వారం గ్యాప్ వ్యవధి అయినా మెగా ఇమేజ్ ఉన్న చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయంటే? వసూళ్ల పరంగా రెండు చిత్రాల మధ్య పోటా పోటీ తప్పదు.
