అన్నదమ్ములిద్దరిదే ఒక్కటే సమస్య!
టాలీవుడ్ బ్రదర్స్ చిరంజీవి-పవన్ కళ్యాణ్ సమస్య ఒక్కటేనా? ప్రేక్షకుల మధ్యలోకి రావడానికి ఆలస్యా నికి కారణం ఒక్కటేనా? అంటే అవుననే అనాలి.
By: Tupaki Desk | 6 Jun 2025 8:39 PM ISTటాలీవుడ్ బ్రదర్స్ చిరంజీవి-పవన్ కళ్యాణ్ సమస్య ఒక్కటేనా? ప్రేక్షకుల మధ్యలోకి రావడానికి ఆలస్యా నికి కారణం ఒక్కటేనా? అంటే అవుననే అనాలి. చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం పూర్తి కాలేదు. కొన్ని నెలలుగా టీమ్ అదే పనిలో ఉన్న పూర్తవ్వలేదు. మధ్యలో ఎన్నో రిలీజ్ తేదీలు కూడా ఇచ్చారు.
కానీ ఏది జరగలేదు. వాయిదాకి కారణం ఏంటి? అంటే సీజీ పూర్తికా కపోవడంతోనే డిలే అవుతుందని తేలింది. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం కావడంతో సీజీ పనులు అధికంగా ఉన్నాడు. దేశ...విదేశాల్లో ఆ పనులు జరుగుతున్నాయి. అయినా ఇంతవరకూ ఓ కొలిక్కి రాలేదు. అందుకే మేకర్స్ కూడా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. సీజీ మొత్తం పూర్తయిన తర్వాత డేట్ ఇస్తే ఎలాంటి గందరగోళం ఉండదని ప్లాన్ చేసి ముందుకెళ్తున్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరిహరవీరమల్లు' కూడా సీజీ కారణంగానే వాయిదా పడుతుంది. ఇంత కాలం పవన్ డేట్లు ఇవ్వక ఆలస్యమైతే? ఇప్పుడాయన షూటింగ్ పూర్తి చేసినా రిలీజ్ అవ్వడం లేదు. జూన్ 12 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు గానీ మళ్లీ వెనక్కి తీసుకున్నారు. వీరమల్లు భారీ పీరియాడిక్ చిత్రం కావడంతో సీజీ, విఎఫ్ ఎక్స్ పనులు ఎక్కువగా ఉన్నాయి.
ఆ పనులు కూడా నెమ్మదిగా జరుగుతున్నాయి. మేకర్స్ అడిగిన టైమ్ కి కంటెంట్ ఇవ్వడం లేదు. అందు కే డిలే అవుతుంది. దీంతో రిలీజ్ విషయంలో తర్జన భర్జన కొనసాగుతుంది. ఇలాంటి సమస్య అన్నద మ్ములిద్దరు ఒకేసారి ఎదుర్కోవడం అన్నది ఇదే తొలిసారి. ఇద్దరు చాలా సినిమాల్లో నటించారు. కానీ ఏ సినిమా విషయంలో ఇలాంటి క్లాష్ ఏర్పడలేదు.
