Begin typing your search above and press return to search.

విశ్వంభర లెవెల్ పెరిగేలా గ్రాండ్ సర్ ప్రైజ్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   21 May 2025 5:47 PM
విశ్వంభర లెవెల్ పెరిగేలా గ్రాండ్ సర్ ప్రైజ్!
X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు వశిష్ఠ మల్లిడి తీసుకురాబోతున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో రూపొందించేందుకు యూనిట్ పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేస్తోంది. గతంలో విడుదలైన టైటిల్ గ్లింప్స్, చిరు లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ మరింత లెవెల్‌కి వెళ్లింది.

ప్రపంచ ప్రసిద్ధ ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’ వేదికగా ‘విశ్వంభర’కు సంబంధించి ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ ప్లాన్ చేయడం గమనార్హం. ఈ ప్రెస్టీజియస్ ప్లాట్‌ఫాంపై నిర్మాత విక్రమ్ కుమార్ అడుగు వేయడం విశేషం. రెడ్ కార్పెట్‌పై కనిపించిన ఆయనను కెమెరాలు క్యాప్చర్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూమెంట్ తో ‘విశ్వంభర’కు గ్లోబల్ లెవెల్ ఎక్స్‌పోజర్ లభించనుంది.

ఇంతకీ కేన్స్ ఫెస్టివల్ స్టేజ్‌పై ఈ సినిమా కోసం ఏమి ప్రెజెంట్ చేయబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ ప్రోమో, లేదా ఇంటర్నేషనల్ వర్షన్ పోస్టర్ రివీల్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే VFX, ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్ విషయంలో ఈ మూవీకి ప్రత్యేకంగా 70 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

అందుకే ఈ సినిమాను ప్రపంచస్థాయిలో ప్రెజెంట్ చేయాలనే యత్నంగా ఈ గ్రాండ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లు అర్ధమవుతోంది. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుండగా, ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ ఫీల్‌తో ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. UV క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను సమ్మర్ చివర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విశ్వంభర షూటింగ్ చివరి దశకు చేరువవుతోంది.

గ్రాఫిక్స్, మ్యూజిక్, మేకింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉండనున్నాయని యూనిట్ టాక్. ఇప్పటికే చిరంజీవి వరుస ఫ్లాపుల నుంచి బౌన్స్‌బ్యాక్ కావాల్సిన తరుణంలో ఉండగా, ‘విశ్వంభర’ అందుకు పర్ఫెక్ట్ ప్లాట్‌ఫామ్‌గా మారనుంది. ఇక తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో స్టెప్ వేసిన విధానం చూస్తే, మెగాస్టార్ గ్లోబల్ స్టేజ్‌పై మరోసారి తన స్థాయిని చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. సో.. ఈ గ్రాండ్ సర్‌ప్రైజ్‌తో మెగా ఫ్యాన్స్‌కి ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారో చూడాలి.