Begin typing your search above and press return to search.

విశ్వంభర వీఎఫ్ఎక్స్.. చిరు సలహా ఇచ్చారట!

అయితే ఇప్పటికే పలుమార్లు సినిమా విడుదల వాయిదా పడడంతో తొలుత దీనిపై ఓ సలహా ఇచ్చారంట.

By:  Tupaki Desk   |   12 July 2025 5:16 PM IST
విశ్వంభర వీఎఫ్ఎక్స్.. చిరు సలహా ఇచ్చారట!
X

మెగాస్టార్ చిరంజీవి లీడ్ లో నటిస్తున్న సోసియో ఫాంటసీ విశ్వంభర సినిమా డిలే అవుతూ వస్తోంది. అయితే చాలా కాలం తర్వాత మెగాస్టార్ ఫాంటసీ జానర్ లో చేస్తుండడంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు.

ఈ సినిమాలో భారీ స్థాయిలో గ్రాఫిక్స్, హై విజువల్స్ ఉండడంతో సినిమా ఆలస్యం అవుతోంది. ఇప్పటికే పలుమార్లు సినిమా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. దీని విడుదలపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. తాజాగా విశ్వంభం వీఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ పనులు పూర్తైనట్లు తెలుస్తోంది.

హీరో చిరంజీవి కూడా స్వయంగా సినిమా ఫైనల్ కట్‌ ను చూశారట. వీఎఫ్ ఎక్ క్వాలిటీ చూసి అద్భుతంగా ఉందని, ఔట్ పుట్ హాలీవుడ్ రేంజ్ లో ఉందని చిరు మూవీ టీమ్ ను అభినందించినట్లు తెలిసింది. గ్రాఫిక్స్ విషయంలో ఆయన ఫుల్ సంతృప్తి చెందినట్లు సమాచారం. అలాగే సినిమా విడుదలకు కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

అయితే ఇప్పటికే పలుమార్లు సినిమా విడుదల వాయిదా పడడంతో తొలుత దీనిపై ఓ సలహా ఇచ్చారంట. గ్రాఫిక్స్, విజువల్స్ పనులు పూర్తయ్యే వరకు రిలీజ్ డేట్ ప్రకటించ వద్దని మేకర్స్ కు చెప్పారని తెలుస్తోంది. ఇప్పుడు విజువల్స్ పనులు పూర్తి కావడం వల్ల మెగాస్టార్ రిలీజ్ డేట్ కు ఓకే చెప్పారంట. దీంతో మేకర్స్ కూడా కొత్త రిలీజ్ తేదీ సెర్చింగ్ లో ఉన్నారట.

కాగా విశ్వంభర గ్రాఫిక్స్ పనులు ఫేమస్ సంస్థ బాధ్యతలు చూస్తున్నట్లు తెలిసింది. అయితే సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుండడంతో వీఎఫ్ ఎక్స్ కు ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ మిస్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఆలస్యం అయినా ప్రేక్షకులకు నాణ్యమైన ఔట్ పుట్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారు. ఇక ఇటీవల సినిమా నుంచి ఓ పాట కూడా రిలీజ్ చేశారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ త్రిష, మృణాల్ ఠాకూర్, అషికా రంగనాథ్‌ ఆయా పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ పై వంశీ, విక్రమ్, ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరు కెరీర్ లో జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత ఫాంటసీ జానర్లో వస్తున్న సినిమా ఇది.