Begin typing your search above and press return to search.

విశ్వంభ‌ర టీమ్ దానిపై ఫోక‌స్ చేయాల్సిందే!

ఏ సినిమాకైనా బ‌జ్, హైప్ చాలా ముఖ్యం. సినిమాపై బ‌జ్ లేక‌పోతే ఆ సినిమాలో ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్ న‌టించినా ఉప‌యోగం ఉండ‌దు.

By:  Tupaki Desk   |   16 April 2025 2:30 PM
విశ్వంభ‌ర టీమ్ దానిపై ఫోక‌స్ చేయాల్సిందే!
X

ఏ సినిమాకైనా బ‌జ్, హైప్ చాలా ముఖ్యం. సినిమాపై బ‌జ్ లేక‌పోతే ఆ సినిమాలో ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్ న‌టించినా ఉప‌యోగం ఉండ‌దు. ప్ర‌స్తుతం విశ్వంభ‌ర సినిమాకు ఇంచుమించు ఇవే ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న సినిమాకు చెప్పుకోద‌గ్గ బ‌జ్ లేదంటే అస‌లు చిత్ర యూనిట్ ఏం చేస్తుంద‌న్న‌ది ఆలోచించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా విశ్వంభ‌ర‌. సోషియో ఫాంట‌సీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా మొద‌లైన‌ప్పుడు సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సినిమా నుంచి టీజ‌ర్ వ‌చ్చిందో అప్పుడే అస‌లు నెగిటివిటీ మొద‌లైంది. లేక‌పోతే విశ్వంభ‌ర ఈ పాటికే రిలీజై ఉండేది.

కేవ‌లం టీజ‌ర్ కు వ‌చ్చిన నెగిటివిటీ వ‌ల్లే విశ్వంభ‌ర వాయిదా ప‌డింద‌నేది ఒప్పుకోవాల్సిన వాస్త‌వం. అందుకే ఆ నెగిటివిటీని త‌గ్గించేందుకు చిత్ర యూనిట్ వెంట‌నే ఆ విఎఫ్ఎక్స్ బాధ్య‌తల్ని వేరే టీమ్ కు అప్ప‌గించి మంచి అవుట్‌పుట్ ను తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా విశ్వంభ‌ర నుంచి రామ రామ అనే ఫ‌స్ట్ సింగిల్ రిలీజైంది.

ఈ పాట వినడానికి బాగానే ఉన్న‌ప్ప‌టికీ ఆడియ‌న్స్ లోకి వెంట‌నే రీచ్ అయ్యేలా ట్యూన్ క్యాచీగా, ట్రెండీగా లేదు. దీనికంటే రాములోరి మీద మొన్నా మ‌ధ్య వ‌చ్చిన ఓ ప్రైవేట్ సాంగ్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయింది. దాంతో పోలిస్తే కీర‌వాణి కంపోజ్ చేసిన ట్యూన్ సో సో గానే ఉంది. మొత్తానికి విశ్వంభ‌ర ఫ‌స్ట్ ట్యూన్ చార్ట్ బ‌స్ట‌ర్ కాలేక‌పోయింది.

సో, ఇప్ప‌టికిప్పుడు విశ్వంభ‌ర‌పై హైప్ పెంచాలంటే సినిమా నుంచి ఆడియ‌న్స్ ను నెక్ట్స్ లెవెల్ లో శాటిస్‌ఫై చేసే కంటెంట్ ను మేక‌ర్స్ వద‌లాలి. అది టీజ‌ర్ రూపంలోనా, పాట రూపంలోనా అనేది ప‌క్క‌న పెడితే మంచి కంటెంట్ ను రిలీజ్ చేసి ఆడియ‌న్స్ అటెన్ష‌న్ ను ఆ దిశ‌గా మ‌ళ్లిస్తే త‌ప్పించి విశ్వంభ‌ర‌కు బ‌జ్ పెరిగేలా లేదు. విశ్వంభ‌ర టీమ్ ఈ విష‌యంపై ఫోక‌స్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.