కేన్స్ లో విశ్వంభర ఎపిక్ బుక్!
ఈ ఇంటర్నేషనల్ స్టేజ్‌లో 'విశ్వంభర' ప్రాజెక్ట్‌పై ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇస్తూ, నిర్మాత విక్రమ్ రెడ్డి ఓ ఎపిక్ బుక్‌ను ఆవిష్కరించారు.
By: Tupaki Desk | 22 May 2025 2:12 PM ISTఇండియన్ మైథాలజీకి ఆధునిక టెక్నాలజీ కలగలిపి రూపొందుతున్న భారీ సినిమాగా విశ్వంభర ఇప్పటికే ఆసక్తి రేపుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం మెగా ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్‌గా మారింది.
ఈ ఇంటర్నేషనల్ స్టేజ్‌లో 'విశ్వంభర' ప్రాజెక్ట్‌పై ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇస్తూ, నిర్మాత విక్రమ్ రెడ్డి ఓ ఎపిక్ బుక్‌ను ఆవిష్కరించారు. ఇందులో సినిమా థీమ్, దాని వెనక ఫిలాసఫీ, ఇండియన్ మైథాలజీ ఎలిమెంట్స్, అలాగే విజువల్ సేకరణలు, ఆర్ట్ వర్క్‌లు ప్రస్తావించబడ్డాయి. సినిమాను ప్రెజెంట్ చేసే విధానం గ్లోబల్ ఆడియెన్స్‌కి కూడా ఆకర్షణీయంగా ఉండేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ బుక్ ప్రస్తుతం “విశ్వంభర పుస్తకం లోపల ఏముంది?” అనే క్యూరియాసిటీకి కారణమవుతోంది.
ఈ సందర్భంగా మూవీ VFX అంశాలపై కూడా సమాచారం వెల్లడించారు. ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోల సహకారంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపుగా 90 శాతం పూర్తయ్యాయని విక్రమ్ చెప్పారు. సినిమా మొత్తం ప్రామాణికంగా రూపొందించబడుతోంది. 2025లో తెలుగు సినిమా మార్కెట్‌ను ఈ సినిమా కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందన్న టాక్ టోలీవుడ్లో వినిపిస్తోంది.
కీరవాణి సంగీతం ఈ సినిమాకి మరో హైలైట్. ఇప్పటికే విడుదలైన రామా రామా సాంగ్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. చిత్రంలో త్రిష కథానాయికగా, అశికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. పోస్టర్‌ల నుంచి టీజర్, బుక్ రిలీజ్ వరకు ప్రతి అప్‌డేట్ వేర్వేరు రేంజ్‌లో చర్చనీయాంశమవుతుండగా, ఇక రిలీజ్ ప్రోమోషన్స్ ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ ఎపిక్ వెనుక UV క్రియేషన్స్ భారీ ప్లాన్ తో సాగుతోంది. ప్రత్యేకంగా గ్రాఫిక్స్ కోసమే 70 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి. ఇక సినిమా విడుదల అనంతరం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
