Begin typing your search above and press return to search.

మెగాస్టార్ మూవీలో ముగ్గురు సూపర్ స్టార్స్‌

చిరంజీవి చాలా సంవత్సరాల తర్వాత ఒక సోషియో ఫాంటసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు

By:  Tupaki Desk   |   17 Jan 2024 5:01 AM GMT
మెగాస్టార్ మూవీలో ముగ్గురు సూపర్ స్టార్స్‌
X

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంక్రాంతి సందర్భంగా 'విశ్వంభర' అనే టైటిల్‌ ను ఖరారు చేసి అధికారికంగా ప్రకటన చేయడంతో పాటు ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది.

చిరంజీవి చాలా సంవత్సరాల తర్వాత ఒక సోషియో ఫాంటసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కథ మాదిరిగా ఈ సినిమా కథ కూడా అత్యంత విభిన్నంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నారట. కథానుసారంగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని, ఇప్పటికే వారి ఎంపిక కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి సినిమా కోసం ఏకంగా ముగ్గురు లేడీ సూపర్ స్టార్స్ ని సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి.

చిరంజీవికి జోడీగా గతంలో నటించిన త్రిష మరియు నయన తారలను ఈ సినిమాలో నటింపజేస్తున్నారు. వీరిద్దరు సౌత్ లో లేడీ సూపర్ స్టార్స్ కాగా బాలీవుడ్‌ లేడీ సూపర్ స్టార్‌ దీపికా పదుకునేను కూడా ఈ సినిమాలో నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

లేడీ సూపర్‌ స్టార్స్‌ అయిన నయనతార, త్రిష మరియు దీపికా పదుకునే లతో ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే కచ్చితంగా విశ్వంభర అతి పెద్ద పాన్ ఇండియా మూవీ అవ్వడం ఖాయం అనడంలో సందేహం లేదు.