Begin typing your search above and press return to search.

విశ్వంభ‌ర‌.. గ‌గుర్పొడిచే పోరాటాలు

ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో హైదరాబాద్‌ అల్లుమియం ఫ్యాక్టరీలో చిరంజీవి స‌హా కొంతమంది ఫైటర్స్‌పై హై-ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 April 2024 5:36 AM GMT
విశ్వంభ‌ర‌.. గ‌గుర్పొడిచే పోరాటాలు
X

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బ్లాక్‌బస్టర్ బింబిసార ఫేం వశిష్ట ద్వితీయ ప్ర‌య‌త్న‌మే చిరంజీవి లాంటి పెద్ద స్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని పొందాడు. ప్రతిభావంతుడైన దర్శకుడు మెగాస్టార్‌ను లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్రలో తెర‌పై ఆవిష్క‌రించ‌నున్నారు. దీనికోసం అద్భుత‌మైన సోషియో ఫాంట‌సీ కథను సిద్ధం చేశాడు. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ కథానాయిక. ఇటీవలే కొన్ని టాకీ పార్ట్‌లు, ఒక పాట, ఒక యాక్షన్ బ్లాక్‌ని చిత్రీక‌రించ‌గా షెడ్యూల్ పూర్త‌యింది. ఇటీవ‌ల‌ హైదరాబాద్‌లో కీలకమైన యాక్షన్ షెడ్యూల్‌ను ప్రారంభించారు.

ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో హైదరాబాద్‌ అల్లుమియం ఫ్యాక్టరీలో చిరంజీవి స‌హా కొంతమంది ఫైటర్స్‌పై హై-ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఫైట్ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. కీలకమైన దశలో వచ్చే ఈ ప్రత్యేక యాక్షన్ సీక్వెన్స్ వీక్షకులను మెస్మ‌రైజ్ చేయ‌నుంది.

విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్ కోసం టాప్ రేంజ్ సాంకేతిక నిపుణులు ప‌ని చేస్తున్నారు. ఈ సినిమా అత్యుత్త‌మ‌ సాంకేతిక ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండ‌గా, శ్రీ శివశక్తి దత్తా- చంద్రబోస్ గీత రచయితలు. విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.