Begin typing your search above and press return to search.

బాలయ్య మూవీలో విశ్వక్ జస్ట్ మిస్సా?

"రీసెంట్ గా ఓ పెద్ద సినిమాలో పెద్ద రోల్ వదిలేశా. అది కూడా నాకు ఇష్టమైన హీరోతోనే. ఆ సినిమాలో కీలకమైన పెద్ద రోల్ నాకు ఆఫర్ చేశారు మేకర్స్.

By:  Tupaki Desk   |   17 Feb 2024 12:30 PM GMT
బాలయ్య మూవీలో విశ్వక్ జస్ట్ మిస్సా?
X

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం యువ హీరోల్లో దూసుకుపోతున్నారు. వరుసగా కమర్షియల్ సినిమాలతో మెప్పిస్తూ హిట్స్ కొడుతున్నారు. మరోవైపు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఆ తర్వాత ఫలక్ నామా దాస్ మూవీతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రస్తుతం విశ్వక్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన విశ్వక్ సేన్.. అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవలే ఓ పెద్ద హీరో సినిమాలో అవకాశాన్ని వదులుకున్నానని తెలిపారు. గతేడాది రిలీజై బ్లాక్ బస్టర్ అయిన బేబీ మూవీ ఛాన్స్ కూడా అప్పట్లో విశ్వక్ వదులుకున్నారు. ఆ తర్వాత సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా నుంచి కూడా డ్రాప్ అయ్యారు. ఇంతకీ విశ్వక్ ఏం చెప్పారంటే?

"రీసెంట్ గా ఓ పెద్ద సినిమాలో పెద్ద రోల్ వదిలేశా. అది కూడా నాకు ఇష్టమైన హీరోతోనే. ఆ సినిమాలో కీలకమైన పెద్ద రోల్ నాకు ఆఫర్ చేశారు మేకర్స్. ఇంకా చెప్పాలంటే వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ చేసిన లాంటి రోల్ అనుకోవచ్చు. నాకు ఇష్టమైన హీరో సినిమాలో అంత పెద్ద మంచి రోల్ వస్తే నేను వదిలేశా. నేను చేయలేదు" అని విశ్వక్ సేన్ తెలిపారు.

ఆ సినిమా చేసుంటే తనకు బాగా డబ్బులు వచ్చి ఉండేవని చెప్పారు విశ్వక్ సేన్. అదే పెద్ద హీరోతో ఇంకా మంచి సినిమా చేస్తానని ప్రకటించారు. వంద మందిలో ఐదుగురు తన క్యారెక్టర్ ను ఇష్టపడితే, తాను వాళ్ల కోసం మాత్రమే సినిమాలు తీస్తానని చెప్పారు. మిగతా 95 మందిని తృప్తిపరచడం కోసం ప్రయత్నించనని తెలిపారు విశ్వక్.

అయితే విశ్వక్ వదిలేసుకున్న ఆ సినిమా ఏంటని నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు. అది బాలకృష్ణ సినిమా ఆఫర్ అయి ఉంటుందని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. బాలయ్య-బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బీకే 109 అని అంటున్నారు. అందులో ఓ కీలకమైన పాత్ర కోసం విశ్వక్ సేన్ ను అనుకున్నారట మేకర్స్. ఆ మేటర్ కొన్ని రోజుల క్రితమే లీక్ కూడా అయింది.

కానీ విశ్వక్ ఆ సినిమా నుంచి డ్రాప్ అయ్యారనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇక విశ్వక్ బదులు ఆ పాత్రను మరో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ చేస్తున్నారట. మరోవైపు, అది బాలయ్య మూవీ కాదని, ఎన్టీఆర్ దేవర సినిమా అని ఇంకొందరు అంటున్నారు. విశ్వక్ ఫేవరెట్ హీరో తారక్ అని, ఆ సినిమానే అయ్యి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. మరి అది ఏ మూవీయో విశ్వక్ కే తెలియాలి.