Begin typing your search above and press return to search.

నో అంటే నో.. విశ్వక్ కౌంటర్ బేబీ గురించేనా?

తాజాగా, మరోసారి అలాంటి ట్వీటే చేశాడు. అయితే, ఆ ట్వీట్ దేని గురించా అనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది

By:  Tupaki Desk   |   21 July 2023 7:31 AM GMT
నో అంటే నో.. విశ్వక్ కౌంటర్ బేబీ గురించేనా?
X

టాలెంటెడ్ యంగ్ హీరీల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. కేవలం హీరోగా నటించడమే కాదు, డైరెక్షన్ బాధ్యతలు కూడా పూర్తిగా నిర్వహించగల సత్తా ఉన్నోడు. తాను నటించిన రెండు సినిమాలకు ఆయనే స్వయంగా డైరెక్షన్ చేసి వ్హా అనిపించుకున్నాడు. ఆ రెండు సినిమాలు అనుకన్నంత హిట్ కాకపోయినా, ఆయనలోని డైరెక్టర్ మాత్రం అందరికీ నచ్చేశాడు.ఇటీవల దాస్ కా దమ్కీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో డ్యూయల్ రోల్ లో అదరగొట్టాడు. ముఖ్యంగా నెగిటివ్ రోల్ లో ఆయన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

ప్రస్తుతం విశ్వక్ చేతిలో రెండు, మూడు సినిమాలు కూడా ఉన్నాయి. విశ్వక్ కేవలం సినిమాలతోనే కాదు, సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తనకు నచ్చిన విషయాలు, నచ్చని విషయాలతో పాటు, తనను ఎవరైనా ఏదైనా అంటే వెంటనే ఫాట్ మని కొట్టినట్లుగా ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. తాజాగా, మరోసారి అలాంటి ట్వీటే చేశాడు. అయితే, ఆ ట్వీట్ దేని గురించా అనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే, 'నో అంటే నో అనేది మగవాళ్లకు కూడా వర్తిస్తుంది. అందుకే ప్రశాంతంగా, కూల్ గా ఉండండి. ప్రశాంతతను పంచండి. రిలాక్స్ అవ్వండి’ అంటూ ట్వీట్ చేశాడు. అసలు విశ్వక్ ఈ ట్వీట్ ఎందుకు చేశాడా అని ఫ్యాన్స్ నెట్టింట చర్చించడం మొదలుపెట్టారు. అసలు ఏదీ లేకుండా, ఆయన ఈ ట్వీట్ చేయడు కదా, ఏం జరిగి ఉంటుందా అని ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలో ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఏంటంటే, ఇటీవల బేబీ సినిమా విడుదలై, సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ సాయి రాజేష్ ఓ మాట అన్నారు. తాను హృదయ కాలేయం సినిమా తీసిన డైరెక్టర్ ని అని, తనతో సినిమా చేయడానికి ఓ హీరో నిరాకరించాడు అంటూ కామెంట్ చేశాడు. కనీసం కథ కూడా వినలేదు అని ఆయన వాపోయారు. ఎవరబ్బా ఆ హీరో అనే చర్చ ఓ వైపు జరుగుతుండగా, అంతలో విశ్వక్ నుంచి ఓ ట్వీట్ వచ్చింది.

ఇంకేముంది, ఆ మూవీని రిజెక్ట్ చేసింది విశ్వక్ సేన్ అని, డైరెక్టర్ అన్నది ఆయనేనని అందుకే, ఇప్పుడు విశ్వక్ ఇలాంటి ట్వీట్ చేశాడు అంటూ నెటిజన్లు ఓ కన్ క్లూజన్ కి వస్తున్నారు. మరి అందులో నిజం ఎంతవరకు ఉన్నది అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఎవరో ఒకరు ఈ విషయం పై మాట్లాడి క్లారిటీ ఇస్తే గానీ ఈ చర్చకి పులిస్టాప్ పడదు.