Begin typing your search above and press return to search.

విశ్వక్ అక్కడ సీరియస్.. ఇక్కడ ఫ్రెండ్లీ

ఈ నగరానికి ఏమైంది' చేయడానికి ముందే ఒక సినిమా కోసం తనను అజయ్ సంప్రదించాడని.. తన ఫొటోలు పంపమని అడిగాడని.. కానీ తాను పంపలేదని విశ్వక్ వెల్లడించాడు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 1:36 PM GMT
విశ్వక్ అక్కడ సీరియస్.. ఇక్కడ ఫ్రెండ్లీ
X

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఎప్పుడో వార్తల్లో ఉండే వ్యక్తి అంటే విశ్వక్ సేన్‌యే. ఈ తరం యూత్‌కు ప్రతినిధిలా కనిపించే కొంచెం అగ్రెసివ్‌గా, కొంచెం ఔట్ స్పోకెన్‌లా కనిపిస్తాడు. కొన్నిసార్లు అనుకోకుండా కాంట్రవర్శీల్లో భాగం అవుతుంటాడు. కొన్నిసార్లు తనే పనిగట్టుకుని వివాదాలు రాజేస్తుంటాడు. తద్వారా తనతో పాటు తన సినిమాలూ వార్తల్లో ఉండేలా చూస్తాడు. ఈ మధ్యే తన కొత్త చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ డేట్ మారుస్తుండటం మీద హర్టయి అతను పెట్టిన పోస్టు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

అంతకుముందు 'బేబి' సినిమా రిలీజ్ టైంలో విశ్వక్ సేన్ చుట్టూ ఒక వివాదం ముసురుకుంది. ఈ సినిమా కోసం ముందు దర్శకుడు సాయిరాజేష్.. విశ్వక్‌నే సంప్రదించగా.. కనీసం అతను స్క్రిప్టు వినడానికి కూడా ఆసక్తి చూపించలేదట. ఇదే విషయం మీద సాయిరాజేష్ ఒక వేదిక మీద విశ్వక్ పేరెత్తకుండా మాట్లాడటం.. దానిపై విశ్వక్ సక్సెస్‌ను ఎంజాయ్ చేయకుండా తనను టార్గెట్ చేయడం మీద అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఈ వివాదం వార్తల్లో నిలిచింది. ఐతే 'బేబి' దర్శకుడితో విశ్వక్ వ్యవహారం చాలా సీరియస్‌గా మారితే.. ఇలాంటి ఇంకో ఇష్యూ గురించి ఇప్పుడు విశ్వక్ సరదాగా స్పందించాడు. 'ఆర్ఎక్స్ 100'తో సెన్సేషన్ క్రియేట్ చేసి.. లేటెస్ట్‌గా 'మంగళవారం'తో హిట్ కొట్టిన అజయ్ భూపతికి కూడా విశ్వక్ హ్యాండ్ ఇచ్చాడట.

'ఈ నగరానికి ఏమైంది' చేయడానికి ముందే ఒక సినిమా కోసం తనను అజయ్ సంప్రదించాడని.. తన ఫొటోలు పంపమని అడిగాడని.. కానీ తాను పంపలేదని విశ్వక్ వెల్లడించాడు. అప్పటికి 'ఈ నగరానికి ఏమైంది'కి కమిటవ్వడం వల్లే తాను స్పందించలేదని.. కానీ అజయ్ అది మనసులో పెట్టుకోకుండా తనతో ఫ్రెండ్లీగానే ఉన్నాడని విశ్వక్ తెలిపాడు. 'మహాసముద్రం' సినిమా కథను కూడా ముందు తనకే చెప్పాడని.. కానీ డేట్లు సర్దుబాటు చేయలేక ఆ సినిమా ఒప్పుకోలేదని... త్వరలోనే తామిద్దరం కలిసి సినిమా చేస్తామని అతనన్నాడు.