Begin typing your search above and press return to search.

'మెకానిక్ రాకీ' స్టోరీ లైన్.. విశ్వక్ సెలక్షన్ కేక!

ఖాజాగూడ ప్రాంతంలోని ఆర్కే గ్యారేజ్‌లో ప్రత్యేకంగా వేసిన గ్యారేజ్ సెట్‌ లో మెకానిక్ రాకీ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్టోరీ లైన్ ఇదేనంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   26 Feb 2024 3:05 PM GMT
మెకానిక్ రాకీ స్టోరీ లైన్.. విశ్వక్ సెలక్షన్ కేక!
X

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. అవకాశాలు రావడం మామూలే.. కానీ ఎలాంటి కథలను సెలక్ట్ చేసుకుంటామన్నదే ఇంపార్టెంట్ అన్న విధంగా తెలుగు ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు విశ్వక్. ప్రతి సినిమాలో ఓ కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. త్వరలో అడ్వెంచర్ థ్రిల్లర్ గామి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

గామి మూవీలో అఘోర శంకర్ గా కనిపించబోతున్నారు విశ్వక్. మానవ స్పర్శను తట్టుకోలేని ఓ అఘోరగా నటిస్తున్నారు. మార్చి 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కాబోతుంది. పీరియాడిక్ పొలిటికల్ బ్యాక్‌ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.

విశ్వక్ లైనప్ లో ఉన్న మరో మూవీ కల్ట్. అయితే ఈ సినిమాకు కథ అందించి ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ నటించడం లేదు. ఈ మూవీ ఓ డిఫరెంట్ డ్రగ్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కనుందని టాక్. ఇటీవల విశ్వక్ ప్రకటించిన మరో చిత్రం లైలా. స్వీయ డైరెక్షన్ లో విశ్వక్ ఈ మూవీలో నటిస్తున్నారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో లైలా పాత్రను విశ్వకే పోషిస్తున్నారు.

వీటన్నింటితోపాటు విశ్వక్ లైనప్ లో మెకానిక్ రాకీ మూవీ కూడా ఉంది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీతో దర్శకుడు రవితేజ ముళ్లపాడి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్ర పోషిస్తోంది. మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఖాజాగూడ ప్రాంతంలోని ఆర్కే గ్యారేజ్‌లో ప్రత్యేకంగా వేసిన గ్యారేజ్ సెట్‌ లో మెకానిక్ రాకీ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్టోరీ లైన్ ఇదేనంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఫేక్ యాక్సిడెంటల్, మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ లను క్యాష్ చేసుకునే వ్యక్తుల చుట్టూ ఈ సినిమా సాగుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.