Begin typing your search above and press return to search.

అప్పుడు కమల్.. ఇప్పుడు విశ్వక్!

లైలా మూవీ సెకండ్ పార్ట్ లో తాను లేడీ గెటప్ లో నటిస్తున్నట్లు విశ్వక్ తెలిపారు. ఎక్కువ సేపు లేడీ గెటప్ లోనే ఉంటానని చెప్పారు.

By:  Tupaki Desk   |   3 March 2024 12:30 AM GMT
అప్పుడు కమల్.. ఇప్పుడు విశ్వక్!
X

మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఒక మూవీ సెట్స్ పై ఉండగానే.. మరో సినిమా ప్రకటిస్తున్నారు. కంటిన్యూగా సినిమా షూటింగ్స్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ గా దూసుకెళ్తున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తున్నారు. సుమారు నాలుగు ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన గామి మూవీతో మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లోకి రానున్నారు.

గామి మూవీ.. శివరాత్రి పండుగ కానుకగా వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. మానవ స్పర్శ తట్టుకోలేని అఘోరగా కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. సినీ పరిశ్రమలో అనేక మంది ప్రముఖులు కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్లు ట్వీట్స్ చేస్తున్నారు.

తాజాగా గామి ప్రమోషన్స్ లో భాగంగా.. విశ్వక్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. తన కొత్త ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు. ఇప్పటికే ప్రకటించిన లైలా మూవీ ప్రస్తావన తీసుకొచ్చారు. గతంలో లైలా చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తానే చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు.. ఈ మూవీకి హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ కు చెందిన కొత్త డైరెక్టర్.. దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు విశ్వక్. దీంతో పాటు.. ఫ్యాన్స్ కు మరో సర్ప్రైజింగ్

న్యూస్ చెప్పారు.

లైలా మూవీ సెకండ్ పార్ట్ లో తాను లేడీ గెటప్ లో నటిస్తున్నట్లు విశ్వక్ తెలిపారు. ఎక్కువ సేపు లేడీ గెటప్ లోనే ఉంటానని చెప్పారు. అది లైలా రోల్ లోనేనని తెలుస్తోంది. అయితే గతంలో విలక్షణ నటుడు కమల్ హాసన్, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, శివ కార్తికేయన్ తోపాటు మంచు మనోజ్ లేడీ రోల్స్ చేశారు. ఆయా పాత్రల్లో తమ నటనతో అదరగొట్టారు. ఇప్పుడు విశ్వక్.. లేడీ గెటప్ లో కనిపించనుండడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరి ఈ ఛాలెంజింగ్ టాస్క్‌ ను విశ్వక్ సేన్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలని నెటిజన్లు అంటున్నారు. ఏ ప్రయోగం అయినా.. మాస్ కా దాస్ రెడీ అని చెబుతున్నారు. లైలా మూవీ కోసం వెయిటింగ్ అంటూ సందడి చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్.. ఏప్రిల్ నెలాఖరులో లేదా మే తొలి వారంలో మొదలు కానుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి క్రేజీ అప్డేట్ రానుందని సమాచారం.