Begin typing your search above and press return to search.

GOG : మీసం మెలేస్తున్న విశ్వక్ సేన్

ఇప్పుడు మూవీ యూనిట్.. శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ మరో పోస్టర్ ను రిలీజ్ చేసింది. అందులో హీరో విశ్వక్ సేన్ తో గ్యాంగ్ తో గోదావరి ఒడ్డున నిల్చుని ఉన్నారు.

By:  Tupaki Desk   |   8 March 2024 4:57 PM GMT
GOG : మీసం మెలేస్తున్న విశ్వక్ సేన్
X

టాలీవుడ్ మాస్ కా దాస్ నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి ఈ మూవీలో హీరోయిన్‌ గా నటిస్తుండగా.. తెలుగు అందం అంజలి మరో లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తోంది. ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ మూవీ లవర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

చెప్పాలంటే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈరోజే(మార్చి 8వ తేదీ) మహాశివరాత్రి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సిస్టర్ మరణించడంతో మ్యూజిక్ వర్క్ పెండింగ్ ఉండిపోయింది. దీంతో మేకర్స్.. ఈ మూవీ రిలీజ్ ను వాయిదా వేశారు. దాని ప్లేస్ లో విశ్వక్ మరో మూవీ గామి విడుదల చేశారు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా త్వరలో విడుదల కానుంది.

ఇదంతా పక్కన పెడితే.. ఉమెన్స్ డే సందర్భంగా మేకర్స్ అంజలి పోస్టర్ ను రిలీజ్ చేశారు. అంజ‌లి తన లేడీ గ్యాంగ్ తో కలిసి క‌త్తి ప‌ట్టుకుని, కుర్చీ మీద కాలు పెట్టి ఊర మాస్ లుక్ లో నిల్చుని ఉన్న పోస్టర్ తెగ ఆకట్టుకుంది. ఇప్పుడు మూవీ యూనిట్.. శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ మరో పోస్టర్ ను రిలీజ్ చేసింది. అందులో హీరో విశ్వక్ సేన్ తో గ్యాంగ్ తో గోదావరి ఒడ్డున నిల్చుని ఉన్నారు.

పోస్టర్ లో విశ్వక్ సేన్ పవుర్ ఫుల్ గా లుంగీ కట్టులో మీసం మెలేస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్.. సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తుందని సినీ పండితులు చెబుతున్నారు. మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ప్రతి సినిమాకు విశ్వక్ వేరియేషన్ చూపిస్తున్నారని అంటున్నారు.

గోదావరి బ్యాక్ డ్రాప్‌ లో సాగే పొలిటికల్ విలేజ్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది.గోదావరి కుర్రాడిగా సరికొత్త లుక్ లో కనిపించనున్నారు విశ్వక్ సేన్. గోపరాజు రమణ, హైపర్ ఆది, ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి GOG రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.